కాలా ఫస్ట్ రివ్యూ.. రేటింగ్ ఎంతో తెలుసా..!

shami
సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన కాలా సినిమా రేపు అనగా జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. పా. రంజిత్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను రజిని అల్లుడు ధనుష్ నిర్మించాడు. కబాలి తర్వాత రంజిత్ డైరక్షన్ లో రజిన్ చేసిన ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 


వరల్డ్ వైడ్ గా రజినికి ఉన్న ఫ్యాన్స్ అంతా ఈ కాలా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ముంబై ధారావి బ్యాక్ డ్రాప్ కథతో వస్తున్న ఈ సినిమాలో రజిని లుక్ అదిరిపోయింది. నానా పటేకర్ విలన్ గా నటించిన ఈ సినిమాలో ఈశ్వరి కుమార్, హ్యూమా ఖురేషి నటించారు.


ఇక ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ రివ్యూ యు.ఏ.ఈ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు ఇచ్చాడు. 4 పాయింట్ రేటింగ్ ఇస్తూ సినిమా సూపర్ హిట్ అన్నట్టుగా చెప్పాడు ఉమర్ సంధు. రజిని నటన, స్టైల్, లుక్ అన్ని సినిమాకు ప్లస్ పాయింట్స్ అని అన్నాడు. ఇక నానా పటేకర్ నటన కూడా బాగుందని అన్నాడు.


ప్రతి సౌత్ సినిమాకు ఉమర్ సంధు మొదటి రివ్యూ ఇవ్వడం కామనే కాని ఆ రివ్యూ ప్రేక్షకులు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన 4 రేటింగ్ ఇచ్చి సూపర్ హిట్ అన్న సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. స్పైడర్, అజ్ఞాతవాసి సినిమాలకు ఉమర్ సంధు అలానే రేటింగ్ ఇచ్చాడు. మరి అసలు సినిమా రిజల్ట్ ఏంటన్నది మరి కొద్ది గంటల్లో తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: