ఒత్తిడిలతో మాట మార్చిన తేజ !

Seetha Sailaja
సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్న ప్రముఖ కుటుంబాలకు వ్యతిరేకంగా ఎంత గొప్పవ్యక్తి అయినా ఒక్క సాహసం చేయలేరు అన్న విషయానికి ఉదాహరణగా మరో లేటెస్ట్ సంఘటన జరిగింది. గత రెండు రోజులుగా ఇండస్ట్రీని షేక్ చేసిన ఉదయ్ కిరణ్ బయోపిక్ పై తేజ మాట మార్చాడు. అసలు ఉదయ్ కిరణ్ జీవితాన్ని బయోపిక్ గా తీయాలనే ఆలోచనే తనకు రాలేదని తేజ మీడియాకు లీకులు ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఉదయ్ కిరణ్ బయోపిక్ లో చిరంజీవి పాత్ర కోసం రాజశేఖర్ ను అనుకుంటున్నానని నిన్న ఉదయమే లీకులిచ్చిన తేజ ఒక్కరోజు గడవకుండానే తనమాట మార్చడం వెనుక తేజా పై తీవ్రమైన ఒత్తిడులు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు ప్రముఖులు ఈఆలోచనలు విరమించుకోమని తేజాకు సున్నితమైన హెచ్చరికలు ఇచ్చినట్లు గాసిప్పులు గుప్పు మంటున్నాయి. 

అయితే మీడియా వర్గాలలో వచ్చిన వార్తల ప్రకారం తేజ రాజశేఖర్ తో చర్చలు జరపడం వాస్తవం అంటున్నారు.  అయితే ఈ ఆలోచనలు మానుకోమని రాజశేఖర్ ద్వారా సూచనలు తేజాకు అందాయని ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఈ గాసిప్పులకు ఎలర్ట్ అయిన తేజ తాను రానాతో తీయబోతున్న సినిమా విషయంలో రాజశేఖర్ ను కలిసానని మాట మార్చినట్లు సమాచారం. 

దీనితో గత రెండు రోజులుగా ఇండస్ట్రీలో హడావిడి చేసిన ఉదయ్ కిరణ్ బయోపిక్ ఆదిలోనే ఆగిపోయింది అనుకోవాలి. అయితే ఎన్నో రహస్యాలు ఉన్న ఉదయ్ కిరణ్ జీవితం పై ఎవరైనా ధైర్యం చేసి బయోపిక్ తీయగలిగితే అది కూడ ‘మహానటి’ స్థాయిలో విజయవంతం అవుతుంది. అయితే అంత సాహసం చేయగల వ్యక్తి ఎవ్వరు అన్న విషయం ప్రస్తుతానికి సమాధానం దొరకని ప్రశ్న..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: