నటి ఐశ్వర్యను పెళ్లి చేసుకోలేదు!

Edari Rama Krishna
గత కొంత కాలంగా కన్నడ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్న నటుడు హుచ్చ వెంకట్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ నెలకొంది.  సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చూపించే విధంగా హీరోయిన్ కి ఇష్టమైన వరుడు హీరోయిన్ తల్లికి నచ్చకపోతే ఎంత రాద్దాంతం చేస్తుందో..ఆ మద్య ‘కిక్’ చిత్రంలో చూపించారు.  అచ్చం ఇప్పడు కన్నడ నటి  ఐశ్వర్య విషయంలో కూడా ఇలాగే ఉంది. నటుడ్ని పెళ్లాడిన హీరోయిన్ ఉదంతం హాట్ టాపిక్ గా మారటమే కాదు.. హీరోయిన్ తల్లి నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావటం ఇప్పుడో ఇష్యూగా మారింది.

శాండవుల్ కు చెందిన నటుడు హుచ్చ వెంకట్. ఆయన.. డిక్టేటర్ హుచ్చ వెంకట్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఐశ్వర్యను తాజాగా పెళ్లాడారు. పెళ్లి వారం క్రితమే జరిగినా.. తాజాగా బయటకు వచ్చింది. రహస్యంగా సాగిన వీరి పెళ్లి.. ఎంత సింఫుల్ గా జరిగిందంటే.. మెడలో పసుపుకొమ్ముతో కూడిన తాడుతో కట్టి.. దండలు మార్చుకున్నట్లుగా చెబుతున్నారు. తలకావేరి వద్ద వీరి పెళ్లి చాలా సింఫుల్ గా జరిగినట్లుగా తెలుస్తోంది.

తాజాగా ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన వెంకటల్.. ఇంట్లో వారికి తెలీకుండా పెళ్లి చేసుకున్నట్లు చెప్పి.. తమను క్షమించి అందరిలో ఒకడిగా చూడాలని కోరారు.వెంకట్ పెళ్లి వ్యవహారాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు ఐశ్వర్య తల్లి రూప. వారి పెళ్లిని తాను ఒప్పుకోవటం లేదని.. మూడు రోజులుగా ఐశ్వర్య తనకు ఫోన్లో దొరకటం లేదన్నారు. తాజాగా ఈ కథలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.  మూడు రోజుల క్రితం ఫేస్ బుక్ లైవ్ లో తాను హీరోయిన్ ఐశ్వర్యను వివాహం చేసుకున్నానని చెప్పి సంచలనం సృష్టించిన కన్నడ నటుడు హుచ్చ వెంకట్, మాట మార్చాడు.

తాను ఆమెను పెళ్లి చేసుకోలేదని చెబుతూ, ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. 'డిక్టేటర్ హుచ్చ వెంకట్' అనే సినిమాలో కలసి నటిస్తున్నారు. గతంలో సోషల్ మీడియాలో వీరిద్దరి పెళ్లి వేడుక దృశ్యాలు ప్రత్యక్షంకాగా, అవి సినిమా కోసం తీసిన పెళ్లి సీన్ లోని దృశ్యాలని, నిజమైన పెళ్లి దృశ్యాలు కాదని అన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: