కాస్టింగ్ కౌచ్ పై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్య!

siri Madhukar
గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి పెద్ద ఉద్యమం తీసుకు వచ్చింది.  నెల రోజుల నుంచి వివిధ ఛానెల్స్ లో కాస్టింగ్ కౌచింగ్ (పడక సుఖం) పై ఇంటర్వ్యూలో ఇస్తూ వచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో ఏదైనా సినిమా చాన్స్ కావాలంటే బడాబాబుల పడుకోవాల్సిందే..లేదంలే సినిమా ఛాన్స్ లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతారని ఆమె ఆరోపిస్తూ వచ్చింది.  అంతే కాదు తనకు ‘మా’అసోసియేషన్ వారు సభ్యత్వం ఇవ్వలేదని ఏకంగా అర్థ నగ్న ప్రదర్శన చేయడంతో నెషనల్ న్యూస్ ఛానల్ లో సందడి చేసింది. 

దీంతో ‘మా’ అసోసియేషన్ దిగి వచ్చి ఇండస్ట్రీలో 900 మందితో నటించొచ్చు అని చెప్పడమే కాకుండా ఆమెకు అన్ని రకాలగా అండదండగా ఉంటామని చెప్పారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ పై ఎంతో మంది నటీమణులు ముందుకు వస్తున్నారు. తాజాగా నటి పూనమ్ కౌర్ కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఓ టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, తనకూ ఈ పరిస్థితి ఎదురైందని చెప్పింది. ఏదో అయిపోయిందని తానేమీ చెప్పుకోనని, సమయం అనుకూలంగా లేదని భావిస్తే, ఎలా బయటపడాలో ఆలోచించి, ఆ పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకుంటానని ఆమె తెలిపింది.   

తనకు ఎంతో ఓపిక ఉందని..ఎదుటి వారి మనసు నొప్పించే మనస్తత్వం కాదని తన చుట్టూ ఏం జరుగుతుందన్న సంగతి తనకు తెలుసునని, ఓ అమ్మాయి ఎంతగా బాధపడితే, తనకు జరిగిన అన్యాయాన్ని నలుగురిలో చెప్పుకునేందుకు ముందుకు వస్తుందో అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించింది.  అంత మాత్రాన తాను బలహీనురాలిని మాత్రం కాదని..తాను చేయగలిగిందే చేస్తానని, భయపెట్టే వ్యక్తి ఏం చేయగలడో ఎదురు నిలబడి చూస్తానని ధైర్యంగా ఉండటం తనకెంతో ఇష్టమని చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: