బ్యూటీ క్వీన్ శ్రీదేవి చుట్టూ వై-ఫై లా మాధురీ దీక్షిత్ & విద్యాబాలన్

ఇది బయోపిక్ చిత్రాల కాలం. బాలీవుడ్ లో కొన్ని బయోపిక్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. అయితే తెలుగులో ఈ మద్య కాలంలో సావిత్రి జీవిత చరిత్రను మహానటి పేరుతో తెరకెక్కిస్తున్నారు చలసాని అశ్వనిదత్ అల్లుడు నాగ అశ్విన్. కీర్తి సురెష్ సావిత్రిగా చూడముచ్చటగా ఉంది. అయితే సినిమా ఎంతవరకు ప్రేక్షకాధరణ చూరగొంతుందో చూడాలి. 


అయితే బయోపిక్‌ చిత్రాలు తెరకెక్కించడం అంత సులభం కాదు. ప్రతిఒక్కరి జీవిత చరిత్రను వెండితెరపై ఎక్కించనూలేరు. అందుకో తగిన చరిత్ర అర్హత ఉండాలి. అలా ఆ మధ్య భారత క్రికెట్‌ కెప్టెన్‌ ఎంఎస్‌.ధోని జీవిత చరిత్రతో రూపొందిన చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అంతకు ముందు సంచలన శృంగారతార సిల్క్‌స్మిత బయోపిక్‌ "ది దర్టీ పిక్చర్‌" పేరుతో తెరకెక్కి సంచలన విజయం నమోదు చేసింది. అందులో స్మిత పాత్రలో నటి విద్యాబాలన్‌ అద్భుత నటన ప్రదర్శించి జాతీయ అవార్డును గెలుచుకున్నారు. 


తాజాగా అతిలోకసుందరి శ్రీదేవి జీవిత చరిత్రను ఆమె భర్త బోనీ కపూర్‌ అపురూప చిత్రంగా చిత్రంగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారనే వార్త ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆమె జీవిత చరిత్రను సినిమాగా రూపొందించడానికి దర్శకుడు హన్సల్‌మెహ్తా సన్నాహాలు చేస్తున్నారు.


అసలు శ్రీదెవి బయోపిక్ అంటేనే  "లైఫ్ సైజ్ స్క్రీన్ వైడ్ స్టోరీ" అని చెప్పక్కరలేదు. ఒక చారిత్రక ప్రాధాన్యత ఉన్న కథానాయకిని మించిన కథ కథనం ఇందులో ఇమిడి ఉంటాయని చెప్పక్కర్లేదు. అసలు శ్రీదెవి అంటేనే మహానటి సావిత్రిలా ఒక అర్ధదశాబ్ధం చిత్ర చరిత్ర. ఒక రామారావు, ఒక నాగేశ్వరరావు చరిత్రలంత లైఫ్ సైజ్ కథా కథనం. దర్శకుడి ప్రతిభకు ఒక సవాల్. తమిళనాట పుట్టి, తమిళ చిత్ర సీమ లోకి నాలుగేళ్ళ వయసులోనే బాలతారగా అడుగిడి, తెలుగు, కన్నడ చిత్రాల్లో పసివయసు లోనే బహు భాషా బాలతారగా గుర్తింపు పొందిన నటి శ్రీదేవి.


శ్రీదేవి తమిళ చిత్రాల నుంచి హిందీ చిత్రాల్లో నటించే స్థాయికి ఎదిగారని, ఆమె జీవితంలో ఆర్థిక సమస్యలు, వైద్యుల శస్త్ర చికిత్స తప్పిదం తో తల్లి మరణం, ఆ ఆస్పత్రి నిర్వాకంపై కోర్టు కేసు వేయడం, దుబాయి లో ఆమె మరణం వరకూ శ్రీదేవి జీవిత అంశాలు ఒక అద్భుతమైన సినిమా నిర్మాణానికి సరిపోయేలాగ ఉన్నాయని అన్నారు. అవన్నీ ఈ చిత్రం లో చోటు చేసుకుంటాయని తెలిపారు. 


ఈ చిత్రంలో శ్రీదేవి పాత్రలో నటి విద్యాబాలన్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరగుతున్నాయని తెలిపారు. శ్రీదేవితో కలిసి నటించిన రజనీకాంత్, కమల్ హసన్, అమితాబ్‌ బచ్చన్, ధర్మేంద్ర, మిథున్‌చక్రవర్తి లాంటి పాత్రలు కూడా ఈ చిత్రంలో చోటు చేసుకుంటాయని, వారి ఎంపిక జరుగుతోందని చిత్ర దర్శకుడు హన్సల్‌మెహ్తా తెలిపారు. 

 

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ నిర్మిస్తున్న ఒక చిత్రంలో శ్రీదేవి నటిచాల్సి ఉండగా, శ్రీదేవి మరణంతో ఆ స్థానాన్ని మాధురి దీక్షిత్‌తో భర్తీ చేయాలని నిర్ణయించారు ఆయన.  ఈ విషయాన్ని తెలియజేస్తూ "ఇన్‌స్టాగ్రామ్‌" లో భావోద్వేగంతో కూడిన ఒక పోస్టు చేసింది కూతురు జాహ్నవి.  కరణ్ జోహార్ నిర్మాణసారధ్యంలో అభిషేక్ వర్మన్ (2 స్టేట్ ఫేం) తెరకెక్కిస్తున్న తాజా చిత్ర కథ అమ్మ హృదయానకి హత్తుకుంది.

 

"చాలా వరకూ అమ్మను గుర్తుచేస్తుంది ఈ చిత్రం. ఈ అందమైన చిత్రంలో భాగం కాబోతున్న మాధురిజీ కి - డాడీ, ఖుషీ, నా తరుపున చాలా కృతఙ్జతలు" అంటూ మాధురి దీక్షిత్, శ్రీదేవి కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది జాహ్నవి.  ప్రస్తుతం జాహ్నవి షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. అమ్మ అమ్మే కదా! మరపు చాలా అసాధ్యం. అయితే నాడు శ్రీదేవికి చిత్రసీమలో సరైన పోటీ మధురి మాత్రమే. అయినా ఇద్దరు మంచి స్నేహితులు. బహుశ మాధురి ఆ సినిమాకు న్యాయం చేసి శ్రీదేవికి మరోసారి మన స్మృతిపథం లోకి తెస్తుందెమో! అయితే ఆ సినిమా పేరు "షిదాత్" అంటే "ఇష్టంగా నిరీక్షించటం"  ఇంకేం ఎదుచూద్ధాం అలాగే.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: