అనుష్క కొత్త సినిమా ఓకే అయ్యిందా..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ‘సూపర్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఆ తర్వాత అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోయింది. కాజల్, త్రిష,నయనతార,అనుష్క ఈ ముద్దుగుమ్మలే ఇండస్ట్రీలో టాప్ లీడ్ లో ఉన్నారు.  అయితే అనుష్క ఈ మద్య గ్లామర్ తరహా పాత్రల్లో కనిపించకుండా కేవలం నటనకే మంచి ప్రాధాన్యత ఇస్తుంది. 

అరుంధతి,రుద్రమదేవి, సైజ్ జీరో తర్వాత బాహుబలి,బాహుబలి 2 లో నటించిన అనుష్క గ్లామర్ కి ఎక్కడా చోటు ఇవ్వలేదు.  ఇక హీరోయిన్ ఓరియెంటెడ్ గా రూపొందిన ‘భాగమతి’ చిత్రం కూడా మరో అద్భుత విజయం సాధించడమే కాకుండా టాప్ హీరోలకు వచ్చినన్ని కలెక్షన్లు రావడం మరో విశేషం.  ఈ చిత్రం సూపర్ హిట్ తర్వాత అనుష్కకు మరి కొన్ని ఆఫర్లు వచ్చినా..వాటన్నింటినిక పక్కనబెట్టి  గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి మాత్రమే ఆమె అంగీకరించింది.

అనుష్కకు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉండటంతో..తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.  ఈ సినిమా మొదలుకావడానికి ఇంకా కొంత సమయం ఉండటంతో, ఈ లోగా బరువు తగ్గడంపై అనుష్క దృష్టి పెట్టాలనుకుంటోందట. అందువల్లనే కాస్త బరువు తగ్గే వరకూ వేరే సినిమాలను ఒప్పుకునే ఉద్దేశంతో ఆమె లేదని అంటున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: