ఏపీ ఎగ్జిట్ పోల్స్‌లో ఈ ఒక్క నిజాన్ని మీరు గ‌మ‌నించారా..?

lakhmi saranya
ఏపీలో రిలీజ్ అయిన ఎగ్జిట్ ఫలితాలను గమనిస్తే.. మొత్తం 24 స్థానాలు ఏపీలో ఏం జరుగుతుంది? ఎవరు ఎటువైపు ఉన్నారనే విషయాలపై అంచనా వేశాయి. వీటిలో 6 సంస్థలు.. టిడిపి కూటమి వైపు నిలిచాయి. ఈ సంస్థలు అంచనాలకు మించిన నెంబర్లతో కూటమిలో జోష్ నించాయి. మరో 10 సంస్థలు ఏకంగా వైసిపి విజయం దక్కించుకుంటుందని తీర్పు చెప్పాయి. ఎక్కడ కూడా ఒకటి రెండు సంస్థలు.. వైసీపీని ఆకాశానికి ఎత్తేసాయి. అంటే.. అటు ఆరైనా.. ఇటు పదిైనా.. కూడా నిజమైన ఫలితాన్నీ ఇచ్చాయా? అనేది ప్రధాన ప్రశ్న ను తెర మీదకి తెచ్చాయి. ఇక మిగిలి సంస్థలు మాత్రం తట్టస్థంగానే వ్యవహరించాయి. రాష్ట్రంలో తీవ్రమైన పోటీ ఉందని లెక్కలు వేసాయి. ఎన్నికల పోలింగ్ సరళి, పోటెత్తిన ఓటర్లు.. ముఖ్యంగా మహిళలు కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ బూతుల్లో నిలబడి ఓటు వేసిన తీరు వంటివి అంచనా వేసుకుని ఈ సంస్థలు ఎవరు వైపు మొగ్గు చూపలేదు.

అయితే కొన్ని మాత్రం.. ఏకపక్షంగా ఉంటుందని తీర్పు చెప్పాయి. దీంతో కొంతమేరకు వీటిపై సందేహాలు ముసురుకున్నాయి. అయితే ఈ పూర్తిస్థాయి సంస్థలను గమనిస్తే.. ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. అదే ఏది ఏకపక్షంగా జరగలేదు అని. చిత్రంగా ఉన్న.. నిజం ప్రజానాడిని పట్టుకోవడంలో ఎన్నికలకు ముందు ఉన్న పరిస్థితే... ఎన్నికల తరువాత కూడా ఉందని తేలిపోయింది. ప్రజల తీర్పును ఏ సర్వే కూడా పూర్తిగా అంచనా వేయలేకపోయింది. గత ఏడాది కర్ణాటకలోనూ ఇదే జరిగింది. అప్పట్లో అక్కడ బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తుందని అనేక సర్వేలు చెప్పాయి. ఇంకేముంది.. కాంగ్రెస్ విజయం ఖాయమని.. అయితే బోటా బొటి సీట్లు వస్తాయని చెప్పినవి కూడా ఉన్నాయి.

చివరకు ఫలితం కాంగ్రెస్కే అనుకూలంగా వచ్చిన సర్వే సంస్థలు.‌.. చెప్పింది మాత్రం నిజం కాలేదు. ఎందుకంటే.. కాంగ్రెస్ గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీట్లను సొంతం చేసుకుంది. ఇక ఏపీ విషయంలోనూ ఇదే జరుగుతుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కర్ణాటకలోనూ ప్రజల నాడిని పట్టుకోవడంలో సర్వే సంస్థలు విఫలమయ్యాయి. మొత్తం అక్కడ 32 సంస్థలు సర్వేలు చేస్తే.. కేవలం రెండు సంస్థలు చెప్పినవి మాత్రమే నిజమయ్యాయి. ఇక ఏపీ విషయానికి వస్తే.. పోలింగ్ ఎలా జరిగిందో అందరికీ తెలిసిందే. దీంతో ఫలితం అంచనా వేయడం మేధావులకు కూడా అంతు చిక్కలేదు. దీనిని బట్టి ఏదో జరిగిందనేది వాస్తవం. అయితే కచ్చితంగా నాడిని పట్టుకోలేక పోయాం అన్నది నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: