థియేటర్లలో సందడి చేయబోతున్న ఎన్టీఆర్-రాజమౌళి షార్ట్ ఫిల్మ్

Edari Rama Krishna
దేశంలో ఈ మద్య సైబర్ క్రైం రోజురోజుకు పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో పరిచయం ద్వారా మోసం చేసే వారి సంఖ్యతోపాటు కేసులు కూడా పెరుగుతున్నాయి. వీటిని కంట్రోల్ చేసేందుకు.. అలాంటిని గుర్తించేందుకు తెలంగాణ పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఇలాంటి మోసాల వల్ల జరిగే నష్టాలపై ఇప్పటి వరకు ఎన్నో లఘు చిత్రాలు వచ్చాయి.   సోషల్ మీడియాలో మార్కెటింగ్ బిజినెస్ పేరుతో, ఉద్యోగ అవకాశాలు, ఓటీపీ వంటి మోసాల విషయంలో సాధారణ ప్రజలతోపాటు నెటిజన్లకు అవగాహన కల్పించేందుకు షార్ట్ ఫిల్మ్స్ రూపొందిస్తున్నారు రాష్ట్ర పోలీసులు.

 బాహుబలి తర్వత రాజమౌళి ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అది ఫుల్ లెంగ్త్ మూవీ కాదు...షార్ట్ ఫిల్మ్. హైదరాబాద్ లో రాను రాను పెరుగుతున్న సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు వాటిపై ప్రజల్లో అవగాహన పెంపొంచేందుకు నగర క్రైమ్ బ్రాంచ్ సిద్దమైనది. ఇందు కోసం టాలీవుడ్ లో పాపులర్ దర్శకులైన రాజమౌళి ని సంప్రదించి ఓ లఘు చిత్రం తీయించాలని ఆలోచించిందవి.  

ఈ మేరకు నగర క్రైమ్ బ్రాంచ్ కు సంబందించిన షార్ట్ ఫిలిమ్స్ కు ఎన్టీఆర్, రాజమౌళి స్వచ్చందంగా వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు ముందుకొచ్చారని తెలుస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఆ పనిని పూర్తి చేయగా, ప్రస్తుతం జక్కన్న కూడా సిద్దం అయ్యింది.  సిటీ పోలీసుల ఆధ్వర్యంలో రూపొందిన ఈ ఫిల్మ్ నేటి నుంచి థియోటర్లతో పాటు సోషల్‌ మీడియా మాధ్యమాలైన ఫేస్‌ బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌ తదితరాల ద్వారా ప్రజల మధ్యకు వెళ్లనుంది.

హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌ వివి శ్రీనివాసరావు పీవీఆర్‌ సినిమా థియేటర్‌ లో దీన్ని విడుదల చేశారు. వీటిని బస్టాండ్లో, రైల్వే స్టేషన్ లో, షాపింగ్ మాల్, టీవీ లలో త్వరలో ప్రదర్శించనున్నారు. సినిమా స్టార్స్ ఈ క్యాంపెయిన్ లో చేరటం వల్ల మరింత ప్రచారం లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: