కత్తి మహేశ్ అమ్మాయిలకు అసభ్య సందేశాలు పంపేవాడు.. నిర్మాత సంచలనం..!

Prathap Kaluva

కత్తి మహేష్ ఇప్పుడు ఈ పేరు గురించి అస్సలు చెప్పక్కర్లేదు. పవన్ ఫ్యాన్స్ కు అయితే అస్సలు చెప్పనవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ వన్ లోకి ఎంట్రీ ఇచ్చి అంతో, ఇంతో పాపులారిటీని సంపాదించాడు. అయితే కత్తి మహేష్ ఒక ఫిలిం క్రిటిక్. ఇంతక ముందు సినిమాలకు రివ్యూ లు రాస్తున్న ఎవ్వరికి పెద్ద గా తెలియదు. అయితే బిగ్ బాస్ తరువాత ఎప్పుడైతే పవన్ ను విమర్శించడం మొదలెట్టాడో అప్పటి నుంచి కత్తి మహేష్ కి  ఒక్క సారిగా పాపులారిటీ ఎక్కువ అయిపోయింది.


కత్తి కి మరియు పవన్ ఫ్యాన్సు కు ఒక యుద్ధం జరుగుతుంది అని చెప్పవచ్చు.కత్తి మహేష్ పైన సినీ నిర్మాత రాంకీ తీవ్ర ఆరోపణల చేయడం సంచలనం రేపుతోంది. ఇటీవలి కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన వరుసగా సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో వరుసగా కామెంట్లు చేస్తూ వస్తున్న కత్తిపై రాంకీ చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి.


ఏబీఎన్ టీవీ చానల్ తో మాట్లాడుతూ .. కత్తి మహేష్ తనకు మోహన్ రావిపాటి ద్వారా పరిచయమయ్యాడని చెప్పారు. కత్తి మహేష్ గురించి తనకు బాగా తెలుసుననీ, అతడు సినీ ఇండస్ట్రీకి పట్టిన చీడపురుగని విమర్శించారు. అంతేకాదు అమ్మాయిలకు మహేశ్ అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టేవాడని ఆరోపించారు. కత్తి స్త్రీ లోలుడని చెప్పారు. కత్తి మహేశ్‌కు సంబంధించి మరిన్ని సంచలనాలను రేపు ఉదయం వెల్లడిస్తానంటూ బాంబు పేల్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: