ఖర్మ..! రీఎంట్రీతోనే రచ్చ స్టార్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ..!!

Vasishta

రామ్ గోపాల్ వర్మ.. పేరే ఓ సంచలనం.. ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ ఇష్యూతో హడావుడి చేస్తుంటాడు. ఇప్పటికే అనేక మాధ్యమాల ద్వారా రచ్చరచ్చ చేస్తున్న వర్మ.. ఇప్పుడు మళ్లీ ఇంకోదారి పట్టాడు. ఇన్నాళ్లూ ట్విట్టర్ కు దూరంగా ఉన్న రామ్ గోపాల్ వర్మ.. మళ్లీ అందులో లాగిన్ అయ్యాడు. అది కూడా పవన్ కల్యాణ్ స్ఫూర్తితోనట.!


రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ట్విట్టర్ కింగ్.. కానీ గతేడాది మే 27వ తేదీ అకస్మాత్తుగా ట్విట్టర్ నుంచి వెళ్లిపోయాడు. కేవలం ఇన్ స్టాగ్రామ్ ద్వారానే మాట్లాడతానని, ట్విట్టర్ ను వదిలేస్తున్నానని చెప్పాడు. 2009లో పుట్టిన ట్విట్టర్ కు 2017లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు కూడా చెప్పాడు. అప్పటి నుంచి ట్విట్టర్ ప్రశాంతంగా ఉంది. లేకుంటే రచ్చరచ్చ అయ్యేది. ఏదేమైనా వర్మ వైదొలిగిన తర్వాత సెన్సేషన్స్ లేక ట్విట్టర్ బోసిపోయింది.


అయితే వర్మ ఇప్పుడు మళ్లీ ట్విట్టర్ తెరిచాడు. రీఎంట్రీతోనే సెన్సేషన్ మొదలుపెట్టాడు. పవన్ కల్యాణ్ స్ఫూర్తితోనే ట్విట్టర్ లోకి మళ్లీ వచ్చినట్టు చెప్పాడు. ట్విట్టర్ అజ్ఞాతవాసంలోకి వెళ్లిన నేను.. ఇప్పుడు పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి స్ఫూర్తితో మళ్లీ వచ్చినట్టు ట్వీట్ చేశాడు వర్మ.


అంతేకాదు.. రజనీకాంత్ రాజకీయాలపై ట్వీటేశాడు. రాజకీయాల్లోకి వస్తున్నట్టు రజనీకాంత్ చెప్తున్నప్పుడు ఆయన మొహంలో కనిపించిన కాంతి.. అంతకుముందెన్నడూ చూడలేదన్నాడు. తమిళనాడు ప్రజలందరూ తప్పనిసరిగా రజనీకాంత్ కే ఓటేస్తారనే నమ్మకం తనకుందని చెప్పాడు. ఆయనకు వ్యతిరేకంగా ఎవరు పోటీ చేయాలన్నా అది మూర్ఖత్వమేనని ట్వీటాడు. ఇలా .. రీఎంట్రీతో రచ్చ స్టార్ట్ చేశాడు వర్మ.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: