సల్మాన్ సినిమాకు అక్కడ బ్రేక్..!

siri Madhukar
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా అంటే భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంటుంది.  ముఖ్యంగా బాలీవుడ్ లో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ ల సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది.  తాజాగా సల్మాన్ ఖాన్ కి పాకిస్థాన్ సెన్సాన్ పెద్ద షాక్ ఇచ్చింది.  ఈ నెల 22 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న ‘టైగర్‌ జిందా హై’సినిమాలో తమ దేశాన్ని కించపరిచేలా సీన్లు సెన్సాన్ ఇవ్వకుండా ఆపింది. 

గతంలో సల్మాన్ ఖాన్ నటించిన 'ఏక్‌ థా టైగర్' సినిమాను అక్కడ విడుదల కాకుండా అడ్డుకున్న పాక్ సెన్సార్.. ఇప్పుడు ఆ మూవీ సీక్వెల్ 'టైగర్ జిందా హై' రిలీజ్‌ విషయంలో అలాగే చేసింది.  ఈ మూవీ విడుదలకు సర్టిఫికేట్ ఇవ్వమంటూ ఖరాఖండిగా చెప్పేసింది ఆ దేశ సెన్సార్. దీంతో పాక్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్న సల్మాన్‌ కోరికకు ఆదిలోనే బ్రేక్ పడింది. 

ఈ విషయం గురించి పాక్‌ సెన్సార్‌ బోర్డు ఛైర్మన్‌ మొబషెర్‌ హసన్‌ మాట్లాడుతూ..సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్‌ జిందా హై’ చిత్రానికి ఎన్‌వోసీ ఇవ్వలేం చెప్పారు..కారణం ఈ సినిమాలో పాక్ ని కించపరిచే విధంగా కొన్ని సీన్లు ఉన్నట్లు అందుకోసమే అభ్యంతరం చెబుతున్నామన్ని తేల్చి చెప్పారు. 

2015లో వచ్చిన ‘ఏక్‌ థా టైగర్’ చిత్రంలో పాకిస్తాన్‌ గురించి తప్పుగా చూపించారు. ఇప్పుడు 'టైగర్‌ జిందా హై' చిత్రంలోనూ అదే తప్పు చేశారు. అందుకే సర్టిఫికేట్‌ ఇవ్వలేమని" తెలిపారు. ఈ మూవీలో సల్మాన్ సరసన కత్రినా నటించగా, అలీ అబ్బాస్‌ జఫర్‌ దర్శకత్వం వహించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: