జైల్లో ఉన్నట్లు అనిపించింది : అర్చన

Edari Rama Krishna
తెలుగు బుల్లితెరపై మొట్టమొదటి సారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ‘బిగ్ బాస్’ రియాల్టీ షో ప్రసారం అయ్యింది.  ఈ షో లో మొదట పద్నాలుగు మంది కంటెస్టంట్లు పాల్గొన్నారు.  70 రోజులు, 60 కెమెరాల నిఘా ఉన్న బిగ్ బాస్ హౌజ్ లోకి పద్నాలు మంది కంటెస్టంట్లు వెళ్లారు.  మొదటి వారం జ్యోతి ఎలిమినేట్ అయ్యారు..ఇలా ఒక్కో వారం ఒక్కొక్కరు ఎలిమినే అవుతున్న సమయంలో రెండు సార్లు మాత్రం డబుల్ ధమాకా అంటూ ఇద్దరు కంటెస్టంట్లు ఎలిమినేట్ అయ్యారు.  

ఇక బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మానసిక పరిస్థితి బాగాలేక, ఒంటరి తనం భరించలేక తనకు తానే వెళ్లిపోయాడు.   శని, ఆదివారాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న వారికి టాస్క్ ఇవ్వడం ఎంట్ర టైన్ చేయడం జరిగింది.  మొత్తానికి 70 రోజులు రోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ లో చివరిగా శివబాలాజీ, నవదీప్, ఆదర్శ్, హరిప్రియ, అర్చన మిగిలారు.  

వీళ్లలో ముగ్గురు ఎలిమినేషన్ తర్వాత శివబాలాజీ బిగ్ బాస్ విన్నర్ గా కాగా, ఆదర్శ్ రన్నరప్ గా నిలిచారు.  70 రోజులపాటు కొనసాగిన బిగ్ బాస్ కార్యక్రమం ముగియడంతో ఫైనలిస్టులంతా ఎవరి ఇంటికి వారు చేరుకున్నారు. ఈ కార్యక్రమం గురించి ఫైనలిస్ట్ అర్చన సంతోషం వ్యక్తం చేసింది.  తాజాగా అర్చన ఓ చానల్ తో మాట్లాడుతూ...బిగ్ బాస్ లో తన అనుభవాలు చెప్పంది.  

70 రోజుల తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడం... జైలు నుంచి బయటకు వచ్చినట్టుగా ఉందని తెలిపింది. బిగ్ బాస్ హౌస్ లో జైల్లో ఉన్నట్టే అనిపించిందని చెప్పింది.  బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టిన రెండు వారాల తర్వాత తనకు కష్టాలు మొదలయ్యాయని..తను టార్గెట్ చేసేవారు చాలా మంది తయారయ్యారని, చీటికి మాటికి తనతో గొడవకు దిగేవారని వాపోయింది.  

బిగ్ బాస్ ఇంత ఘన విజయాన్ని సాధిస్తుందని తాను భావించలేదని తెలిపింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేటప్పుడు, ఇన్ని రోజులు షోలో ఉంటానని తాను అసలు ఊహించలేదని అంది.   నటిగా కన్నా బిగ్ బాస్  తర్వాత తనకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోందని చెప్పింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: