రాజకీయాల్లోకి ఉపేంద్ర..కారణం అదేనా..!

Edari Rama Krishna
కన్నడ, తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ సొంతం చేసుకున్నారు రియల్ స్టార్ ఉపేంద్ర.  ప్రస్తుతం హీరోగా మంచి క్రేజ్ లో  ఉన్న వారు అనూహ్యంగా రాజకీయాల్లోకి వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కన్నడ హీరో ఉపేంద్ర కూడా ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఎవరి ఫేట్ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేకపోతున్నాం. అయితే పార్టీలకు మాత్రం వారి సేవలు కీలకంగా మారిపోతున్నాయి.ఈ రోజు సాయంత్రం ఉపేంద్ర బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ కానున్నారు.ఈ భేటీ కన్నా ముందుగా కానీ లేదా ఆ తర్వాత కానీ ఉపేంద్ర మీడియాతో మాట్లాడతారని తెలుస్తోంది.

 గత కొంత కాలంగా  అనేక రాజకీయ పరిణామాలు, అవినీతి, సామాజిక అంశాలపై ట్విటర్ ద్వారా స్పందిస్తున్న ఉపేంద్ర ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలని వెలిబుచ్చుతూనే వున్నారు.ఇప్పటికే తమిళనాట రజనీ, కమల్ పై దృష్టిసారించిన పార్టీలు ఇప్పుడు కన్నడ స్టార్లపై కన్నేశాయి.

కొత్త పార్టీ పెడతాడని, ఆపై దానిని బీజేపీలో విలీనం చేస్తాడని, ఇలా రకరకాల రూమర్లు వచ్చినప్పటికీ అయితే వాటిని ఆయన ఖండించిన దాఖలాలు ఎక్కడా లేవు. ఏది ఏమైనా నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటకలో పర్యటించనుండగా, ఆయన సమక్షంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: