మహేష్ ఫ్యాన్స్ కి హ్యాపీ న్యూస్..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ అందగాడిగా పేరు తెచ్చుకున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు.   ఓ వైపు యాడ్స్ చేస్తూ బిజీగా ఉంటున్న మహేష్ ప్రస్తుతం తమిళ స్టార్ దర్శకుడు మురుగదాస్  దర్శకత్వంలో ‘స్పైడర్’ చిత్రంలో నటిస్తున్నాడు.  కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ సూపర్ డూపర్ హిట్ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ భారీ డిజాస్టర్ గా మిగిలింది.

ఈ చిత్రం ఫ్యామిలీ రిలేషన్స్ తో ఉండటం మాల్ మసాలా ఏమాత్రం లేకపోవడంతో..మహేష్ అభిమానుల సైతం వ్యతిరేకించారు.  దీంతో తన తదుపరి చిత్రం బ్లాక్ బస్టర్ కావాలనే ఉద్దేశ్యంతో తమిళ స్టార్ దర్శకుడు మురుగదాస్ తో ప్రస్తుతం ‘స్పైడర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ అభిమానులకు కావలసినంత ఎంట్రటైన్ మెంట్ ఉంటుందని మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు.   

అయితే ఈ చిత్రం షూటింగ్ మొదలై దాదాపు సంవత్సరం కావస్తున్న ఆ మద్య ఫస్ట్ లుక్, టీజర్ రావడం సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం జరిగింది. తాజాగా మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్..మహేష్ సినిమా ఎలాగూ ఆలస్యం అవుతోంది కాబట్టి మహేష్ పుట్టినరోజు నాటికి కనీసం టీజర్ నైనా చూసి తరించండి అంటూ స్పైడర్ టీజర్ ని రిలీజ్ చేయడానికి ముహూర్తం నిర్ణయించారు.

ఇప్పటికే  స్పైడర్ టీజర్ రిలీజ్ చేయగా దాన్ని మించేలా కొత్త టీజర్ ని రెడీ చేస్తున్నారు . మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ఈ స్పైడర్ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ కానుంది . మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ , ఠాగూర్ మధు లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: