పాపం..వరుణ్ తేజ్..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు అరడజను మంది హీరోలు వచ్చారు.  ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇప్పటికే మంచి ఫామ్ లో ఉండగా సాయిధరమ్ తేజ, వరుణ్ తేజ కొత్తగా ఎంట్రీ ఇచ్చారు.  అయితే సాయిధరమ్ తేజ వరుసగా విజయాలు సాధించగా ఈ మద్య రిలీజ్ అయిన విన్నర్ భారీ డిజాస్టర్ కి గురైంది.  ఇక ముకుంద చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ తర్వాత కంచె చిత్రం మంచి విజయం సాధించాడు.  

ఆ తర్వాత పూరి డైరెక్షన్ లో వచ్చిన లోఫర్ అపజయం కాగా ఈ మద్య శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘మిస్టర్’ కూడా అపజయం పాలైంది.  మొదటి చూపులోనే హీరోగా ఇతగాడు నిలబడతాడు అని అందరూ అనుకునేలా చేసాడు . కానీ వాస్తవ రూపంలోకి వస్తే మాత్రం వరుణ్ నటించిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి , ఒక్కటి కూడా కమర్షియల్ హిట్ కాలేదు అయితే అతడు చేసిన సినిమాల్లో కంచె చిత్రానికి కాస్త మినహాయింపు ఉంది.

మెగా కుటుంబం నుండి వచ్చిన హీరో పైగా మెగా హీరోలలో అందరికంటే అందగాడు కూడా కావడంతో వరుణ్ పై బోలెడు ఆశలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్ . కానీ సక్సెస్ లో మాత్రం ఘోరంగా విఫలం అవుతున్నాడు.  రాబోయే రోజుల్లో మంచి కథలు ఎంచుకుంటే తప్ప మనోడు ఇండస్ట్రీలో నిలబడటం కష్టం అంటున్నారు ఫ్యాన్స్. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: