బాక్సాఫీస్ ని కుమ్మేస్తున్న‘కాటమరాయుడు’..!

Edari Rama Krishna
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాన్.  ప్రస్తుతం పవన్ కళ్యాన్ అంటే కేవలం నటుడిగానే కాకుండా ప్రజా సేవకుడిగా భావిస్తున్నారు తెలుగు రాష్ట్ర ప్రజలు.  సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’ పార్టీ స్థాపించి ప్రజలకోసం పోరాడున్న పవన్ కళ్యాన్ ఈ మద్య ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తిరుపతి, కాకినాడ, అనంతపురం లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రసంగించారు.  

ఓ వైపు రాజకీయ పరంగా ప్రజల కోసం పోరాడుతూనే..మరోవైపు ఎంట్రటైన్ మెంట్ కోసం సినిమాల్లో నటిస్తున్నారు.  సర్ధార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ తర్వాత పవన్ ‘కాటమరాయుడు’ చిత్రంలో నటించారు.  ఈ చిత్రంలో మునుపెన్నడూ కనిపించని విధంగా కొత్త స్టైల్ తో ఫ్యాక్షన్ హీరోగా కనిపించాడు.  ఈనెల 24న రిలీజ్ అయిన కాటమ రాయుడు చిత్రం మొత్తంగా నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది .  శనివారం కాస్త కలెక్షన్లు  తగ్గినా..ఆదివారం మళ్లీ పుంజుకున్నాయి.

నిన్న ఉగాది పర్వదినం కావడంతో 90 పర్సెంట్ కి పైగా కలెక్షన్ల తో బాక్సాఫీస్ ని కుమ్మేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . ఇక మరో ప్రత్యేకత ఏంటంటే కాటమ రాయుడు చిత్రాన్ని చూడటానికి మహిళా ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుండటం విశేషం. గతంలో ‘అత్తారింటికి దారేది’ చిత్రాానికి కూడా ఇలాంటా ఆదరణే లభించింది.  ఇక 300 స్క్రీన్లు, ఆరున్నర కోట్లు..! ఇదీ కాటమరాయుడి ఓవర్సీస్ లెక్క. ఆ మద్య సర్ధార్ తో పొగొట్టుకున్న సొమ్ము కాటమరాయుడు తీసుకు వస్తున్నాడంటూ డిస్ట్రిబ్యూటర్లు సంబర పడిపోతున్నారు.  

అటు క్లాస్, ఇటు మాస్ అభిమానుల ఆకట్టుకుంటున్న కాటమరాయుడు మరిన్ని వసూళ్లు చేస్తుందన్న నమ్మకం ఉందంటున్నారు.  అమెరికాలో సోమవారం దాకా రూ. 6.84 కోట్లు కూడగట్టుకున్నట్లు తేలింది. 300 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా.. మొదటి రోజే ఆరు లక్షల డాలర్లు కలెక్ట్ చేసింది. వీకెండ్ ముగిసేసరికి 10,50,971 డాలర్లు దండుకుంది.  అంతే కాదు ఈ చిత్రం  కలెక్షన్లపై సినీ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ కూడా చేశారు.  కొంతమంది కావాలని కాటమ రాయుడు చిత్రానికి డివైడ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం పెద్ద ఎత్తున వస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: