మళియాల నటి భావన నిశ్చితార్థం..!

Edari Rama Krishna
సినిమా ఇండస్ట్రీలో మొన్నటి వరకు సోషల్ మీడియాలో పెను సంచలనాలు సృష్టించిన నటి భావన మొత్తానికి అనుకున్నది సాధించింది.  తనపై అఘాయిత్యానికి పాల్పడ్డ వారిని కటకటాల వెనక్కి నెట్టే వరకు పెద్ద సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే చేసింది.  ఆమెకు అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన వారు సంఘీభావం పలికారు.  తాజాగా నటి భావన మలయాళ నిర్మాత నవీన్‌తో గురువారం నిశ్చితార్థం చేసుకున్నారు.  ఈ రోజు ఉదయం వాళ్లిద్దరి నిశ్చితార్థం చాలా సింపుల్ గా జరిగిందని, వివాహ తేదీ ఇంకా నిర్ణయించలేదని తెలిపారు.

కాగా, నవీన్, భావన కొంత కాలంగా ప్రేమించుకుంటున్న విషయాన్ని భావన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.  వాస్తవానికి  తాము 2014లోనే వివాహం చేసుకోవాలనుకున్నామని, కానీ వృత్తిపరంగా ఉన్న నిబద్ధతల వల్ల కుదరలేదని అప్పట్లో ఆమె అన్నారు.  తాజాగా మలయాళంలో అసిఫ్ అలీ హీరోగా నటిస్తున్న హనీ బీ 2తో పాటు, పృధ్వీరాజ్ న్యూ ప్రాజెక్ట్ ‘ఆదమ్’ మూవీలతో బిజీగా ఉంది భావన .

ఈ చిత్రానికి జినూ అబ్రహామ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోయే ఈ జంటకు తన శుభాకాంక్షలు చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను  పోస్ట్ చేశారు.  తెలుగులో ‘మహాత్మ’, ‘ఒంటరి’, ‘నిప్పు’ వంటి చిత్రాల్లో భావన నటించింది.

ట్విట్ :




Actress #Bhavana got engaged to Kannada Producer #Naveen at a simple ceremony earlier today.. Wedding date yet to be fixed.. Congratulations pic.twitter.com/5r3Zmo4TrC

— Ramesh Bala (@rameshlaus) March 9, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: