విశాల్ లో పరిమళించిన మానవత్వం
అందులోని భాగంగానే తన సంస్థకి మూల నిధులుగా దాదాపు 5 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ నిధులను చెన్నైలో ఫుట్ పాత్ జీవనాన్ని గడుతున్న వారి బాగోగుల కోసం కేటాయిస్తున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. చెన్నై మహానగరంలో నిత్యం ఎంతో మంది ఫుట్ పాత్ లపైనే జీవనాన్ని కొనసాగిస్తుంటారు. వారి పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. అందుకే విశాల్ తన ఆర్గనైజేషన్ ద్వారా ఫుట్ పాత్ జీవనాన్ని గుడుపుతున్న వారికి కనీసం ఒక పూటైన మంచి ఫుడ్ ని, అలాగే వారి కావాల్సిన చిన్నపాటి మౌళిక వసతులను సమకూర్చాలని చూస్తున్నారు.
ఇక ఫుట్ పాత్ జీవనాన్ని కొనసాగిస్తున్న వారిలో ఎవరికైనా పనులను చేసుకొనే శక్తిసామార్ధ్యాలు ఉంటే వారికి తగిన ఉధ్యోగాన్ని సైతం ఈ సంస్థ కల్పించనుందని అంటున్నారు. మొత్తంగా విశాల్ తీసుకున్న ఈ నిర్ణయం చెన్నై ఫుట్ పాత్ జీవినాన్ని కొనసాగించే వారి జీవితాన్నే మార్చేయనుందని అంటున్నారు. ఇక విశాల్ తో పాటు పలువురు హీరోలు సైతం ఈ సేవలో వారి వంతు సేవ చేయనున్నారు.
గతంలోనూ చెన్నె వరదల సమయంలో విశాల్ టీం చక్కని సేవా కార్యక్రమాలను చేసింది. రాత్రిపగలూ చెన్నై వీధుళ్లో తిరుగుతూ వారు చేయగలిగేంత సహాయాన్ని చేశారు. ఇదిలా ఉంటే తాజాగా విశాల్ నటించిన 'కత్తి సండై' సినిమా థియోటర్స్ ని హిట్ చేయటానికి రెడీగా ఉంది. ఈ నెల 29న విశాల్ పుట్టినరోజున ఈ మూవీకి సంబంధించిన రెండు భాషల్లోనూ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.