గజినీ రీమేక్ ని పవన్ రిజెక్ట్ చేశాడట.. కారణం ఏంటో తెలుసా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోలు రీమేక్ సినిమాల ద్వారా సూపర్ హిట్లు కొట్టిన వారు ఉన్నారు. అలాంటి వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరూ. ఆయన కెరియర్ లో ఉన్న హిట్ సినిమాలలో కొన్ని వేరే భాషల నుంచి తెలుగులో రీమేక్ చేయబడినవి అని చెప్పాలి. అయితే ఇలా రిమేక్ సినిమాలు అంటే కొంచెం ఎక్కువగానే ఆసక్తి చూపించే పవన్ కళ్యాణ్.. ఒక రీమేక్ చేయడానికి  మాత్రం తెగ భయపడిపోయాడట. అదే గజినీ రీమేక్. సూర్య ప్రధాన పాత్రలో.. ఆసిన్ హీరోయిన్గా మురుగదాసు దర్శకత్వంలో తెరకెక్కిన గజినీ మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 అయితే ఈ సినిమా తెలుగులో కూడా డబ్ చేయడంతో ఇక్కడ కూడా పెద్ద విజయాన్ని సాధించింది. సూర్య నటనకు సినీ ప్రేక్షకులందరూ ఫిదా అయ్యారు చెప్పాలి. అయితే గజిని సినిమాను రీమేక్ చేయాలని దర్శక నిర్మాతలు పవన్ కళ్యాణ్ ను సంప్రదించారట. కానీ పవన్ మాత్రం ఈ సినిమాను రిజెక్ట్ చేసారు అని తెలుస్తుంది. దీంతో వరుస రిమేక్ లు చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఇలా గజిని రిమేక్ ని ఎందుకు రిజెక్ట్ చేశాడు అన్నది అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.  అయితే ఆ రీమేక్ ని రిజెక్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి అనేది గతంలో పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు తెలుస్తోంది.

 సాధారణంగానే తమిళ సినిమాలో ఎన్నో ప్రయోగాలు చేస్తారు. స్టార్ హీరోలు కమర్షియల్ ఎలిమెంట్స్ కాకుండా డిఫరెంట్ గెటప్స్ వేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు డి గ్లామర్ రోల్స్ లోను కనిపించి మెప్పిస్తారు. కానీ తెలుగులో మాత్రం కమర్షియల్ హీరో అంటే అందంగా ఉండాలి. ఫైట్లు చేయాలి డాన్సులు చేయాలి. ఇవన్నీ ఉంటేనే ఆదరిస్తారు. అయితే గజిని మూవీలో సూర్య గుండుతో కనిపిస్తారు. మతిమరుపు ఉన్న క్యారెక్టర్లో అదరగొట్టాడు. అయితే నేను గుండు గీయించుకుంటే ఫాన్స్ చూస్తారా.. తెలుగు ఆడియోస్ చూస్తారా అనేది పవన్ కళ్యాణ్ డౌటట. చూడరేమో అనే భయంతో  ఇక ఈ రీమేక్ కు నో చెప్పారట. గుండు చేయించుకుంటే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని భయపడ్డాడట పవన్ కళ్యాణ్. అందుకే ఇక ఈ సినిమా రీమేక్ చేసేందుకు ధైర్యం చేయలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: