జగన్: ఆ ఒక్క మాటతో .. మైనార్టీలలో పట్టు..!

Divya
ప్రస్తుతం రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతున్న విషయమేమిటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే.. వాడి వేడిగా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మేము గెలుస్తామంటే మేము గెలుస్తామంటూ అటు అధికార ప్రతిపక్ష పార్టీలు సైతం మాటలు యుద్ధాలతో చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా ఎన్నికలలో చాలామంది నేతల కుటుంబాలలో చిచ్చులు పెట్టేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది నేతల ఇంట్లో రెండు విభిన్నమైన పార్టీలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే గత కొద్ది రోజుల నుంచి ముస్లిం రిజర్వేషన్ల పైన పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

 బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామంటూ కూడా తెలియజేశారని వార్తలు వినిపిస్తున్నాయి... ఈ విషయం అటు ఆంధ్ర వైపుగా కూడా వెళ్ళింది. కూటమిలో భాగంగా ఈ విషయం ఇప్పుడు చాలా తలనొప్పిగా మారుతోంది.. జగన్ ఇటీవలే ఈ విషయం పైన మాట్లాడుతూ.. చంద్రబాబు ఒకవైపు nda తో సఖ్యత పెట్టుకొని మైనార్టీల పైన దొంగ ప్రేమ చూపిస్తున్నారు అంటూ విమర్శించారు.. ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ బిజెపితో జత కట్టిన చంద్రబాబును నమ్మొద్దు అంటూ తెలియజేశారు. ఆరు నూరైనా ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగిస్తామంటూ తెలిపారు జగన్.

ఈ విషయం పైన తాను ఎక్కడికి వరకైనా వెళ్తాను.. పోరాడుతానంటూ తెలిపారు..NRC,CAA అంశాలలో మైనార్టీలకు అండగా ఉంటానంటూ కూడా తెలియజేశారు సీఎం జగన్.. ఈ విషయం పైన మైనార్టీ ఓట్ల విషయంలో పట్టు చూపిస్తున్నారు జగన్. చంద్రబాబును నమ్ముకుంటే కచ్చితంగా కొండచిలువ నోట్లో తలపెట్టినట్టే అంటూ వెల్లడించారు. ఒకవేళ చంద్రబాబుకు ఓటు వేస్తే కచ్చితంగా పథకాలన్నీ ఆపివేస్తారని తెలిపారు. వైసీపీ పాలనలో అభివృద్ధి లేదని ప్రచారం చేస్తున్నారు.. తన హయాంలోనే కొత్తగా నాలుగు ఓడరేవులు.. 10 హార్బర్లు.. 17 మెడికల్ కాలేజీలు కడుతున్నామంటూ ఇవన్నీ చంద్రబాబుకి కనిపించడం లేదా అంటూ కూడా ఎద్దేవ చేశారు.. నాడు నేడుతో స్కూల్లో అభివృద్ధిని చేశామని వాలంటరీల ద్వారా పథకాలను ఇంటి వద్దకే చేరుస్తున్నామంటూ వెల్లడించారు.తమ మేనిఫెస్టోలో చెప్పిన హామీలను 99% నెరవేర్చామంటూ తెలిపారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: