పవన్‌ సేఫ్‌.. జగన్‌ సేఫ్‌.. ఎటొచ్చీ బాబుకే చిక్కులన్నీ?

ఈ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడం వల్ల పవన్ కల్యాణ్ కి లాభమే కానీ నష్టం లేదంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే పవన్ పార్టీని సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోలేదు. ఈ సారి ఎన్నికల్లో అయినా తన ఉనికిని చాటుకోవాలని జనసేనాని భావించి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే గత ఎన్నికల్లో జనసేనకు చేదు ఫలితాలు వచ్చాయి.

పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన రెండు చోట్ల  ఓడిపోగా .. ఆ పార్టీ నుంచి ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకవేళ పవన్ ఒక్కచోటైనా ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే.. జనసేనకు గాజు గ్లాస్ గుర్తు పర్మినెంట్ అయ్యేది. కానీ అలా జరగలేదు. దీంతో ఎన్నికల సంఘం గాజు గ్లాస్ ను ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. దీంతో ఈ గుర్తు స్వతంత్రుల వశం అయింది. జనసేన పోటీ చేయని చోట ఇండిపెండిట్ అభ్యర్థులకు వరంలా మారింది.

దీంతో ఇప్పుడు టీడీపీ, బీజేపీలకు ఇది పెద్ద నష్టం తెస్తోంది. ఎటొచ్చి జనసేన మాత్రం సేఫ్ గానే ఉండిపోయింది. కానీ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయని చోట ఇప్పుడు టీడీపీ, బీజేపీలకు గాజు గ్లాస్ తెగ టెన్షన్ పెడుతోంది. దీంతో ఇప్పుడు కోర్టులో ఈ గుర్తును స్వతంత్రులకు కేటాయించొద్దని టీడీపీ వాదించాల్సి వస్తోంది. జగన్ ని ఓడించే ఉద్దేశంతో.. జనసేన ఓటు బ్యాంకు కలిసి వస్తుందని అనుకున్న చంద్రబాబు ఆశలు అడియాసలు అయ్యేలా కనిపిస్తున్నాయి.

మరోవైపు ఈ విషయంలో తాము ఇప్పటికిప్పుడు జోక్యం చేసుకోలేమని కోర్టు సైతం చెబుతోంది. ఎందుకంటే బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా పూర్తైందని.. అంతే కాకుండా 85 ఏళ్ల వృద్ధులు ఇంటి వద్ద ఓటు వేసే ప్రక్రియ  కూడా ఆరంభం అయింది. దీంతో టీడీపీ, బీజేపీ అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. దీంతో ఏరికోరి తెచ్చుకున్న జనసేన తమకే గుచ్చుకుంటుందని చంద్రబాబు కూడా ఊహించలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: