మారుతికి తప్పని తిప్పలు
ప్రస్తుతం ‘బాబు బంగారం’ షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. అయితే ఈ మూవికి సంబంధించిన కథ విషయంలో ఇంకా కొంత అనుమానాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతూనే ఉన్నాయి. ఆగిపోయిన ‘రాధా’ సినిమాకు కాస్త కామెడీని జోడించి తీస్తున్న మూవీనే ‘బాబు బంగారం’ అంటూ కథనాలు వస్తున్నాయి.
దీనికి మారుతి క్లారిటి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే పలుసార్లు మారుతి ఈ విషయంపై క్లారిటి ఇచ్చినప్పటికీ...ఈ తరహా కామెంట్స్ మాత్రం ఎక్కడా ఆగటం లేదు. చిత్ర యూనిట్ నుండే బాబు బంగారం కథపై కొంత అనుమానాలు లేవనెత్తటమే ఇందుకు కారణం అని అంటున్నారు.
ఏదైమైనా బాబు బంగారం మూవీకి సంబంధించి కథ విషయంలో మారుతి క్లారిటీ ఇచ్చుకునే తిప్పలు...రిలీజ్ వరకూ ఆగవు అని అంటున్నారు. ఇక ఈ మూవీలో వెంకీ సరసన నయనతార హీరోయిన్గా నటించింది. అలాగే జూలై 29న ఈ సినిమా థియోటర్స్ ని హిట్ చేయనుంది.