తన పెళ్ళి విషయాలను బయట పెట్టిన తమన్నా !

Seetha Sailaja
మిల్కీ బ్యూటీ తమన్నా నోటివెంట పెళ్ళి మాటలు రావడంతో ఈమె త్వరలో పెళ్ళి పీటలు ఎక్కుతుందా అంటూ మీడియా వార్తలు రాస్తోంది. ఆమధ్య తమన్నా తన పై వస్తున్న ఇలాంటి పెళ్ళి వార్తలను ఖండించింది. అయితే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో టాలీవుడ్ కోలీవుడ్ లలో బిజీగా ఉన్న తమన్నా నోటివెంట ఈమాటలు రావడానికి ఒక కారణం ఉంది. 

ఈమధ్య హైదరాబాద్ లో జరిగిన ఒక కార్పోరేట్ కంపెనీ కార్యక్రమానికి తన అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ మంత్రుల సమక్షంలో ఆమె చేసిన స్కిన్ షోను విమర్శిస్తూ కామెంట్స్ వ్రాసిన మీడియాకు సమాధానం ఇస్తూ తమన్నా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బయట ప్రపంచంలో నిరాడంబరంగా ఉండటం తనకు ఇష్టమే అయినా అలా ఉండేందుకు పరిస్థితులు సహకరించక పోవడంతో తాను సినిమాలలోనే కాకుండా బయట కూడ గ్లామర్ క్వీన్ గా కనిపిoచవలసి వస్తోందని కామెంట్ చేసింది ఈ మిల్కీ బ్యూటీ. 

సినిమాలలో నటిగా ఎదగడం తనకు ఎంత ఇష్టమో నిరాడంబరంగా ఉండటం కూడ తనకు అంతే ఇష్టమని చెపుతూ కొన్ని కారణాల వల్ల తాను అలా గ్లామర్ తో బయటకు రావలసి వస్తోంది అని అంటోంది తమన్నా. అంతేకాదు తనకు ఆడంబరాలతో కూడిన పెళ్ళిళ్ళు అంటే తనకు నచ్చవని అందుకే తాను పెళ్ళి చేసుకుంటే చాల నిరాడంబరంగా తన తల్లితండ్రులు చుట్టాలు సన్నిహితుల మధ్య పెళ్ళి చేసుకుంటాను అని చెపుతోంది ఈ మిల్కీ బ్యూటీ.

ఒకవైపు నిరాడంబరమైన పెళ్ళి తనకు ఇష్టం అని చెపుతూ ప్రపంచంలో తనకు నచ్చిన పెళ్ళి కూతురు ఎవరని అడిగితే యువరాణి ‘డయానా’ అని అంటూ ఆమె పెళ్ళి వేడుక తనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది అని తమన్నా కామెంట్స్ చేసింది. డయానా లుక్, ఆమె ధరించిన దుస్తులు ఆమెను చరిత్రలో నిలిచిపోయే పెళ్ళి కూతురుగా మార్చేసాయని కామెంట్ చేసింది ‘బాహుబలి’ అవంతిక.  అయితే నిరాడంబరమైన పెళ్ళి తనకు ఇష్టం అని ఒక వైపు చెపుతూ మరో వైపు తన కలల రాణి డయానా పెళ్ళి గురించి చెప్పడంతో పాటు తమన్నా నోటి వెంట పెళ్ళి ప్రస్తావన రావడంతో ఈ మిల్కీ బ్యూటీకి తగిన వరుడు ఎక్కడైనా తారస పడ్డాడా అనే సందేహం కలగడం సహజం.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: