ఆ హీరోయిన్ తో పెళ్ళికి రెడీ అవుతున్న కోలీవుడ్ స్టార్ హీరో....!!
అయితే తాజాగా విశాల్ ఆ హీరోయిన్ తో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ కోలీవుడ్ మీడియా మొత్తం వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా..ఆమె ఎవరో కాదు మలయాళ, తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన లక్ష్మీ మీనన్. కోలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం..లక్ష్మీ మీనన్ తో విశాల్ పాండియనాడు,ఇంద్రుడు వంటి సినిమాలు చేశారు.ఇక ఈ సినిమాల్లో నటిస్తున్న టైం లోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి అది కాస్తా ప్రేమ వరకు దారితీసిందని,త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు ఈ మధ్యకాలంలో విశాల్ (Vishal) ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు త్వరలోనే పెళ్లి చేసుకుంటాను.. ఆ విషయాన్ని మీకు చెబుతాను అని చెప్పడం ప్రస్తుతం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. దాంతో విశాల్ అభిమానులందరూ మా అభిమాన హీరో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సంబర పడుతున్నారు.కానీ కొంతమంది మాత్రం ఈ విషయం స్వయంగా విశాల్ చెప్పే వరకు మేము నమ్మం అని కొట్టి పారేస్తున్నారు. మరి విశాల్ పెళ్లి చేసుకునే విషయం నిజామా అబద్ధమా అనేది ఆయన క్లారిటీ ఇవ్వాలని అభిమానులు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.