కిక్ 2 : రివ్యూ
'కిక్ 2' సినిమాలో చాలామంది నటీనటులే ఉన్నారు.. ముందు మిస్టర్ కంఫర్ట్ అదేనండి రవితేజ నుండి మొదలు పెడతా.. ముందుగా రవితేజ డైరెక్టర్గ అనుకున్న కంఫర్ట్ అనే పాత్రకి బాగా ఫిట్ అయ్యాడు. ఇక మాస్ డైలాగ్స్, మాస్ మానరిజమ్స్ చూపడంలో రవితేజ పెట్టింది పేరు కాబట్టి మాస్ గా మంచి నటనని కనబరిచాడు. లుక్ విషయానికి వస్తే గత సినిమా కంటే ఈ సినిమాలో చాలా స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపిస్తాడు. ఉన్నపాటుగా తగ్గడం వలన చాలా చోట్ల ఫేస్ లో మునుపటి కళ కనిపించదు, అలాగే చాలా చోట్ల ముసలి కళ కనపడుతుంది. ఇకపోతే ఫస్ట్ పార్ట్ కి సంబందించిన కళ్యాణ్ పాత్రలో రవితేజ బాగా సెట్ అయ్యాడు. ఇక టాలీవుడ్ లేటెస్ట్ లక్కీ గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్ కి గ్లామర్ తో పాటు కాస్త నటనకి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. మొదట్లో, పాటల్లో మోడ్రన్ లుక్ లో కనిపించి తన అందచందాలతో ఆకట్టుకున్న రకుల్ ప్రీత్ బీహార్ విలాస్ పూర్ విలేజ్ గెటప్ సూపర్బ్ గా సెట్ అయ్యింది. ఆ విలేజ్ లుక్ లో చాలా చాలా క్యూట్ గా ఉంది. ఇక తనకి ఇచ్చిన ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేసింది. కామెడీ కింగ్ బ్రహ్మానందం పండిట్ రవితేజగా ఒక మాదిరిగా నవ్వించాడు. రవితేజ - బ్రహ్మానందం కాంబినేషన్ సీన్స్ ఓకే అనేలా ఔన్నాయి, కానీ కిక్ సినిమా రేంజ్ లో లేవు. బీహార్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడం వలన రాజ్పల్ యాదవ్, సంజయ్ మిశ్రాలను పెట్టుకున్నారు. వీరిద్దరూ సెకండాఫ్ లో నవ్వించడానికి ట్రై చేసారు కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇక చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన పోసాని కృష్ణమురళి, కోవై సరళ, ఆశిష్ విద్యార్థి తమ పాత్రలకు న్యాయం చేసి వెళ్ళిపోయారు. ఇక సినిమాకి కీలకమైన విలన్స్ గా రవి కిషన్ - కబీర్ సింగ్ లు కనిపించారు. వీళ్ళిద్దరూ చూడటానికి 6 అడుగుల పొడవుండి, బలంగా ఉంటారు. కానీ కబీర్ సింగ్ ని అస్సలు వాడుకోలేదు. అంత పెద్ద పర్సనాలిటీని ఊరికే వృధా చేసారు. రవి కిషన్ ని పవర్ఫుల్ గా చూపించి విలనిజంని హైలైట్ చేయడంతో దానికి మించి హీరోయిజం ఎలివేట్ అయ్యింది. తెలుగు ఆడియన్స్ కోరుకునే ఐటెం సాంగ్ లో నోర ఫతేహి తన అందాలతో ఆకట్టుకుంది.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
REVIEW
-
Ravi
-
kalyan
-
Kick 2
-
Cinema
-
ravi anchor
-
rakul preet singh
-
thaman s
-
Kathanam
-
Kick
-
Telugu
-
India
-
Love
-
American Samoa
-
Dargah Sharif
-
war
-
Hyderabad
-
Sambandam
-
silver screen
-
Mister
-
ravi teja
-
Mass
-
Tollywood
-
Bihar
-
Comedy
-
brahmanandam
-
Ashish Vidyarthi
-
Ravi Kishan
-
Kabir singh
-
vamsi
-
surender reddy
-
Hero
-
vakkantham vamsi
-
Audience
-
Manam
-
Success
-
Chicken
-
Music
-
ram pothineni
-
lakshman
-
producer
-
Producer1
-
kalyan ram