కంచె : రివ్యూ
క్రిష్ ఎప్పుడూ ఒక బర్నింగ్ పాయింట్ ని తీసుకొని, రెండు విభిన్న కథలుగా చేసి, ఒకే బ్యాక్ డ్రాప్ లో చెప్పడానికి ట్రై చేస్తుంటాడు.. ఇందులో అతను కులం మీద తన బాణాన్ని సందించాడు. కంచె సినిమాని రెండు టైమింగ్స్ లో చెప్పాడు. ఒకటి 1936, మరొకటి 1944.. ముందుగా 1936 విషయానికి వస్తే.. రాచకొండ సంస్థానానికి అధినేత ఈశ్వర్ ప్రసాద్(నికేతన్ ధీర్), అతని చెల్లెలు ప్రిన్సెస్ సీతాదేవి(ప్రాగ్య జైశ్వాల్). అదే ఊర్లో తక్కువ కులంలో జన్మించిన కుర్రాడు ధూపాటి హరిబాబు(వరుణ్ తేజ్). వీరిద్దరూ మద్రాసు యూనివర్సిటీలో చదువుకుంటూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. కానీ వీరి పెళ్ళికి కులం అడ్డు వస్తుంది. దాంతో ఊర్లో గొడవలు భగ్గుమంటాయి. ఆ గొడవలని ఎలా ఆపారు.? వారి ప్రేమ ఏమయ్యింది.? అన్నది అక్కడి కథ.. ఇక 1944కి వస్తే రాయల్ ఇండియన్ ఆర్మీ హెడ్స్ అయిన ఈశ్వర్ ప్రసాద్ - హరిబాబులు ఇటలీ తరపున పోరాడటానికి సిద్దమవుతారు. అలా వార్ ఫీల్డ్ లో ఉన్న వీరి పై శత్రు సైన్యం ధ్వంసం చేసి ఆర్మీ చీప్ మరియు కల్నల్ ని బందిస్తుంది. కట్ చేస్తే వారి నుంచి తప్పించుకున్న హరిబాబు తనతో పాటు ఉన్న మరో నలుగురుతో కలిసి తమ ఆర్మీ చీఫ్ మరియు కల్నల్ ని ఎలా కాపాడాడు అన్నదే ఇక్కడి కథ.
నటీనటులందరూ ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు.. కాదు కాదు క్రిష్ అందరి నుంచీ ముక్కుపిండి మరీ సూపర్బ్ అవుట్ పుట్ రాబట్టుకున్నాడని చెప్పాలి. వరుణ్ తేజ్ కి ఇది రెండవ సినిమా కానీ తన పెర్ఫార్మన్స్ మాత్రం ఓ పది సినిమాల అనుభవం కలిగిన నటుడిలా ఉంది. ప్రతి చిన్న ఎక్స్ ప్రేషన్ ని కూడా చాలా బాగా ఇచ్చాడు. అలాగే డైలాగ్ డెలివరీ, పదాల ఉచ్చారణలో కూడా చాలా క్లారిటీ అండ్ మెచ్యూరిటీ కనిపించింది. ఇకపై వరుణ్ ఇలాంటి సినిమాలు చేస్తాడో లేదో తెలియదు కానీ నటుడిగా తనకి మంచి గుర్తింపును తెచ్చి తన కెరీర్లో అలా నిలిచిపోయే సినిమా అవుతుంది. ప్రిన్సెస్ అంటే ఇలానే ఉండేదేమో అనిపించేనతలా ప్రాగ్య జైశ్వాల్ ని చూపించారు. ఆమె అలనాటి అచ్చమైన సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన తను ఇచ్చిన హావ భావాలకు కుర్రాళ్ళు ఫిదా అయిపోతారు. సూపర్బ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. తనకి కచ్చితంగా కంచె బిగ్ బ్రేక్ ఇస్తుంది. నికేతన్ ధీర్ నెగటివ్ షేడ్స్ ని బాగానే చూపించాడు. ఇక శ్రీనివాస అవసరాల చలం, శ్రీ శ్రీ గారి మాటలను చెబుతూనే వాటిలో ఉన్న ఓ తెలియని చమత్కారాన్ని ప్రేక్షకులకు అందించి సినిమాలో కాసేపు నవ్వించాడు. గొల్లపూడి మారుతీ రావు, సింగీతం శ్రీనివాసరావు, పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్ లు తమ పాత్రలకు న్యాయం చేసారు.
మొదటి నుంచీ రొటీన్ కి భిన్నంగా వెళ్తున్న క్రిష్ 'కంచె' లాంటి సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి తెలుగు చలన చిత్ర సీమలో ఓ సరికొత్త ఓరవడికి నాది పలికాడు.. ఇలాంటి ఓ సినిమా చేసినందుకు తెలుగు సినిమా ప్రేమికుడుగా క్రిష్ కి సెల్యూట్ చేస్తున్నా...ఇకనన్నా క్రిష్ లాంటి దర్శకున్ని చూసి మన దర్శకులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది.. ఇక కంచె సినిమాకి వస్తే కంచె సినిమాలో ప్రతి తరహా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవే ప్రేమకథ, ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు యుద్ద నేపధ్యంలో వచ్చే వార్ ఎపిసోడ్స్. వీటన్నిటినీ బాగానే మిక్స్ చేసిన క్రిష్ నేరేషన్ ఇంకాస్త స్పీడ్ గా ఉండేలా చెప్పి ఉంటే సినిమా కమర్షియల్ గా కూడా సూపర్ సక్సెస్ అయ్యేది. ప్రస్తుతానికి బాక్స్ ఆఫీసు వద్ద కమర్షియల్ గా యావరేజ్ అనిపించుకున్నా ప్రతి ఒక్కరి హృదయాల్ని టచ్ చేసే సినిమా 'కంచె'. తెలుగూ ప్రేక్షకులు ఇలాంటి సినిమాని తెలుగు తెరపై ఇదివరకూ చూడలేదు కావున వీలైనంత వరకూ ఈ సినిమాని సిల్వర్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయండి..
మరింత సమాచారం తెలుసుకోండి:
-
REVIEW
-
rajeev
-
Telugu
-
Cinema
-
war
-
Episode
-
varun
-
varun sandesh
-
varun tej
-
Romantic
-
Comedy
-
Eshwar
-
Kurradu
-
Chennai
-
prema
-
Love
-
Indian
-
Shatru1
-
Army
-
Haribabu Kambhampati
-
Fidaa
-
sri sri
-
krishna
-
satyam rajesh
-
Audience
-
sekhar
-
Director
-
Suresh
-
Chirantan Bhatt
-
venkat
-
Reddy
-
CBN
-
Hollywood
-
sai madhav burra
-
Success
-
Office
-
silver screen