అనిల్ రావిపూడి కి అసలు విషయం చెప్పిన మహేష్ బాబు !
దీంతో అనిల్ రావిపూడి మహేష్ కి స్టోరీ సిద్ధం చేయడం కోసం వైజాగ్ లో దాదాపు పది రోజుల పాటు కూర్చుని ఒక మంచి మాసాల కథని సిద్ధం చేసి రెడీ గా ఉంచాడు. అయితే ఇన్ని జరిగినా గాని సినిమాపై సరైన క్లారిటీ ఇవ్వలేదు ఇద్దరు. ఇప్పటికే ఈ సినిమా మొదలవుతుందని మహేష్ అభిమానులు అనుకున్నారు..కానీ మహేష్ బాబు మాత్రం అనిల్ రావిపూడి చెప్పిన స్టోరీ పై కొంత డౌట్ గా ఉన్నట్లు ఫిలింనగర్ టాక్.
ఇదే క్రమంలో తన 25వ సినిమా అయిన మహర్షి సినిమా రిజల్ట్ బట్టి అనిల్ రావిపూడి తో సినిమా చేయాలా వద్దా అనేది మహేష్ బాబు డిసైడ్ చేసుకున్నట్లు...దీంతో స్టోరీ రెడీ చేసుకుని తన దగ్గర పెట్టుకొని ఉన్న అనిల్ రావిపూడి తో మహేష్ వెయిట్ చేయమని తెలిపినట్లు ఇండస్ట్రీ టాక్. అయితే మరోపక్క ఈ చిన్న గ్యాప్ లో ఎఫ్ 2 సినిమా విజయం తరువాత వెంటనే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేద్దామనే ఆలోచనలో ఉన్నాడట అనిల్ రావిపూడి.