స్టోరీ లేదు, కానీ ఒపెనింగ్ డేట్ వచ్చేసింది
ఇదిలా ఉంటే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతున్న ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా ముహుర్తం అక్టోబర్ 25న ఉందంటూ అనౌన్స్ వచ్చేసింది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగేశాయి. మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో మంచి ఫాంలో ఉన్న కొరటాల శివ, జూనియర్ తో చేయబోతున్న మూవీపై అందరిలోనూ అంచనాలు పెంచేస్తుంది.
అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు, ఇప్పటి వరకూ జూనియర్ తో సినిమాకి కొరటాల వద్ద స్టోరీ కూడ లేదంట. తాజాగా జూనియర్ కి ఓ స్టోరీ లైన్ చెప్పిన కొరటాల, జూనియర్ వద్ద గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడు. నాన్నకు ప్రేమతో మూవీ షూటింగ్ పూర్తై, తను తిరిగి కొరటాల మూవీతో వర్క్ చేయటానికి దాదాపు 2 నెలల సమయం పైగానే పడుతుంది.
ఈ లోపు పూర్తి కథని రెడీ చేసుకోమని కొరటాలకి జూనియర్ సలహా ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్లాన్ ప్రకారమే కొరటాల స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడు. ఇక త్వరలో సినిమా స్టార్టింగ్ ముహుర్తం పెట్టుకున్న ఈ టీం, పూజా సమయంలో పూర్తి స్క్రిప్ట్ ని కాకుండా...స్టోరీ లైన్ తో మాత్రమే పూజని కార్యక్రమాలని నిర్వహిస్తారని అంటున్నారు.