నా కొడుకుని తొక్కేయాలని చూస్తున్నారు.. పృథ్వీరాజ్ తల్లి ఎమోషనల్ కామెంట్స్..!
ఇలాంటి సమయంలోనే పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేసింది.. ముఖ్యంగా తన కొడుకు పైన దాడులు జరిగాయని, చాలా తక్కువ మంది మాత్రమే అతనికి సపోర్టుగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా దుర్భాషలాడుతూ ఉన్నారు. చాలామంది పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారని అతని ఎదుగుదలను చూసి కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారని ఎలాగైనా తన కొడుకు కెరియర్ నాశనం చేయాలని చూస్తున్నారని ఎమోషనల్ గా మాట్లాడింది. ఇంతటి నిచానికి దిగజారుతున్నటువంటి వారు ఇకమీదట ఇవి ఆపకపోతే ఇలా సమయం సందర్భం వచ్చినప్పుడల్లా తాను మాట్లాడుతూనే ఉంటానంటూ తెలిపింది మల్లిక. ఈ విషయం విన్న అభిమానులు పృథ్వీరాజ్ ను తొక్కేయాలని చూస్తోంది ఎవరా ?అంటూ అభిమానులు సైతం తెగ వెతికేస్తున్నారు.
పృథ్వీరాజ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ బాబు నటించిన వారణాసి సినిమాలో కుంభ అనే విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. సుమారుగా రూ .1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉండగా రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన పోస్టర్స్ ,పాటలు కూడా ఈ సినిమా పైన అంచనాలను మరింత పెంచేశాయి. శృతిహాసన్ పాడిన సంచారి అనే విడుదలైన పాట కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి.