ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి రష్మిక రెమ్యూనరేషన్..మరి అంత తక్కువా..!
నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన గర్ల్ ఫ్రెండ్ సినిమా కోసం రష్మిక కేవలం రూ .3 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు వినిపిస్తోంది. సాధారణంగా ఒక్కో సినిమాకి రూ.6 నుంచి రూ .8 కోట్ల రూపాయల వరకు తీసుకునే రష్మిక గర్ల్ ఫ్రెండ్ సినిమా కథ తనకి బాగా నచ్చడంతో రెమ్యూనరేషన్ తగ్గించి మరి నటించినట్లు ఇటీవలే ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాతలు కూడా తెలియజేశారు. రష్మిక కూడా ఈ సినిమా కథతో తాను సంతృప్తి చెందానని అందుకే తక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుందని టాక్ వినిపిస్తోంది.
గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో దీక్షిత్ శెట్టి కీలకమైన పాత్రలో నటించగా మరొక హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కూడా నటించింది. ఈ సినిమాలో ఈమె పాత్ర కూడా బాగుండడంతో రాబోయే రోజుల్లో ఈమెకు మరిన్ని సినిమాలలో నటించే అవకాశాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ప్రముఖ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రష్మిక ఎంగేజ్మెంట్ జరిగిందని వచ్చే ఏడాది జైపూర్ లో వీరి వివాహం చాలా గ్రాండ్ గా జరిగేలా ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన మాత్రం ఇంకా అఫీషియల్ గా ఎవరు ప్రకటించలేదు. కానీ రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి.