8 నెలల ప్రెగ్నెన్సీ తో యాంకరింగ్ చేసిన స్టార్ యాంకర్..!
తాను గర్భవతిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ నటించిన అశోక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లానని, కానీ అక్కడికి ఎన్టీఆర్ ని చూడడానికి పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత బయటికి వెళ్లే డోర్ ని మూసివేశారు. నా భర్త రాజీవ్ కూడా నాతో పాటే ఉన్నారు. ఒక్కసారిగా జనం రావడంతో బయటికి వెళ్లలేకపోయామని, జనం పెద్ద ఎత్తున రావడంతో డోర్ తీయమని ఇద్దరం ఆరుస్తూ ఉన్నాం, కరెక్ట్ గా జనాలు మమ్మల్ని చేరుకునే సమయానికి డోర్ తీయడంతో ఊపిరి పీల్చుకున్నామని తెలిపారు.
ఆ తర్వాత ఒక గవర్నమెంట్ ఈవెంట్ కి తాను ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో పిలిచారు. అయితే ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో జరిగింది. జనాలు భారీ ఎత్తున వచ్చారు. ఏడు నెలల కడుపుతోనే నేను అక్కడి వెళ్లాను కానీ తనకోసమే జనాలు ఎదురు చూస్తున్నారని తెలిసి అప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది సుమ. ముఖ్యంగా ఏదైనా సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన, టీవీ షో లైన కచ్చితంగా యాంకర్ సుమ ఉండాల్సిందే అన్నట్టుగా పేరు సంపాదించింది. కెరియర్ ప్రారంభంలో నటిగా ఉన్నప్పటికీ ఆ తర్వాత యాంకర్ గా మారి తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది .ముఖ్యంగా తన పంచ్ డైలాగులతో ఆడియన్స్ ని బాగా నవ్విస్తుంది.