హీరో రజనీకాంత్ సోదరుడికి గుండెపోటు..!
ఈ విషయం తెలిసిన వెంటనే రజినీకాంత్ అన్నిటిని క్యాన్సిల్ చేసుకుని వెంటనే చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్లి తన సోదరుడితో పాటు ఆసుపత్రిలోనే ఉన్నట్లుగా సమాచారం. రజనీకాంత్ ఆసుపత్రిలోకి వెళ్తున్న సమయంలో కొంతమంది తీసిన వీడియోలు, ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయం వైరల్ అవ్వడంతో అభిమానులు కూడా రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని పోస్ట్లు షేర్ చేస్తున్నారు. రజనీకాంత్ తన అన్నయ్య ఆరోగ్య పరిస్థితి పైన ఆందోళన చెందుతున్నారని ఆయన సన్నిహితుల నుంచి సమాచారం. సత్యనారాయణ ఆరోగ్యానికి సంబంధించి ఇంకా వైద్యులు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
సత్యనారాయణరావు గైక్వాడ్ ప్రస్తుత వయసు 86 సంవత్సరాలు. గతంలో కూడా ఈయనకు మోకాలి చిప్ప మార్పిడి కి సంబంధించి శస్త్ర చికిత్స జరిగిందని, ఆ తర్వాత కొంతకాలంగా అయినా ఆరోగ్యం దెబ్బతినిందని తరచు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులకు కూడా ఆందోళన చెందుతున్నారు. తన అన్న ఆరోగ్య విషయం పైన రజినీకాంత్ క్లారిటీ ఇవ్వాలని అభిమానులు తెలియజేస్తున్నారు.
రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది కూలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ని సంపాదించుకుంది.ప్రస్తుతం జైలర్ 2 సినిమాలో నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ సుందర్ సి డైరెక్షన్లో ఒక సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.