నాటి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నేడు వైసీపీ ఎంపీ.. ఎవ‌రో తెలుసా... !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

త‌న శిష్యుడు అయిన శివ నాగేశ్వరరావు ని దర్శకునిగా పరిచయం చేస్తూ క్రియేటివ్ డైరెక్ట‌ర్‌ రామ్ గోపాల్ వర్మ ‘ మనీ ‘ సినిమా మొదలు పెట్టిన రోజులవి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అప్రెంటిస్ గా పెట్టుకోమని నిరంజన్ అనే కుర్రాణ్ణి రికమెండ్ చేశారు వర్మ. శివ నాగేశ్వ‌ర రావుకు అదే తొలి సినిమా ... దీనికి తోడు వ‌ర్మ చెప్ప‌డంతో నిరంజ‌న్ అనే కుర్రాడిని కూడా త‌న సినిమా ప‌నిలో పెట్టుకున్నాడు. వ‌ర్మ రిక‌మెండేష‌న్ తో ఆ కుర్రాడొచ్చి మ‌నీ సినిమా షూటింగ్ లో జాయినయ్యాడు. అతని పని ఏంటంటే - ప్ర‌తి రోజు సీన్లు చూస్తూ ఎడిటింగ్ రిపోర్ట్ రాయడం. అసిస్టెంట్ డైరెక్టర్ ఉత్తేజ్ ఆ కుర్రాణ్ణి గైడ్ చేసేవాడు. అలా ఆ సినిమాకు ఆ కుర్రాడు ప‌ని చేశాడు. క‌ట్ చేస్తే ‘ మనీ ‘ సినిమా రిలీజ్ తర్వాత నిరంజన్ మళ్లీ కనబడలేదు.


కాల‌గ‌ర్భంలో చాలా రోజులు గ‌డిచి పోయాయి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ క‌ట్ చేస్తే ఒక టాప్ మోస్ట్ లాయర్ “ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ “ బ్యానర్ పెట్టి , దిల్ రాజు కాంబినేషన్ లో కొన్ని సినిమాలు తీశారు. ఆ తర్వాత సొంతంగా ఇంకొన్ని సినిమాలు తీశారు. అందులో చిరంజీవి - రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఆచార్య’ లాంటి బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ సినిమా ఒకటి. ఇవన్నీ పక్కన పెడితే, వైయస్ఆర్ కాంగ్రెస్ తరపున రాజ్య సభ సభ్యుడయ్యారు. ఎన్నో క్రిటికల్ కేసుల్ని కూడా కోర్ట్ లో అవలీలగా వాదిస్తారనే పేరు ప్రఖ్యాతులు గడించిన ఆయన పేరు నిరంజన్ రెడ్డి. ఇంద‌కు ఈ నిరంజ‌న్ రెడ్డి ఎవ‌రో ?  కాదు .. నాడు ఆ ‘మనీ’ నిరంజనే ..! ఈ నిరంజన్ రెడ్డి.


కాలం చేసే మాయాజాలం చూశారా. . ! ‘మనీ’ తర్వాత ఆయన అలానే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కొనసాగి ఉంటే ఏం జరిగేదో కదా.. ! దేనికైనా రాసిపెట్టి ఉండాలంటారు ఇదేనేమో.. !  నిర‌జంన్ రెడ్డి స్వ‌గ్రామం తెలంగాణ లోని మంచిర్యాల జిల్లా. ఎక్క‌డ మ‌నీ సినిమా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా మొద‌లు పెట్టి ఎక్క‌డికి వెళ్లాడో తెలిస్తేనే ఆశ్చ‌ర్యం వేస్తుంది క‌దా...!


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: