' హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ' ట్రైల‌ర్‌... అదిరిపోయే అప్‌డేట్ ... !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకులు జ్యోతి కృష్ణ - క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా డైరెక్ట్ చేసిన మోస్ట్ అవైటెడ్ సినిమా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. ప‌వ‌న్ కెరీర్ లో ఫ‌స్ట్ టైం పాన్ ఇండియా సినిమా గా ఇది అనౌన్స్ కాగా ... అప్పుడు ఉన్న హైప్ వేరే లెవ‌ల్లో ఉండేది. కానీ ఈ సినిమా నిర్మాణం ఏకంగా ఐదేల్ల పాటు కొన‌సాగుతూ వ‌చ్చింది. చాలా సార్లు రిలీజ్ డేట్ వాయిదా ప‌డింది. ఈ నెల‌లో కూడా 12న రిలీజ్ డేట్ వేసి మ‌రీ వాయిదా వేశారు. ఇది అనౌన్స్ చేసిన టైంలో అయితే హైప్ వేరేగా ఉండేది. ప‌లు మార్లు వాయిదాలు ప‌డుతున్నా కూడా ప‌వ‌న్ క్రేజ్ వ‌ల్ల వీర‌మ‌ల్లుపై హైప్ ఎంతో కొంత కంటిన్యూ అవుతూనే వ‌స్తోంది.


ఇక వ‌చ్చే జూలై 24న రిలీజ్ చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ మ‌రోసారి ప్ర‌క‌టించారు. మ‌రి వ‌చ్చ‌చే నెల‌లో రిలీజ్ కాబోతున్న సినిమా ట్రైలర్ కోసం ముందు అంద‌రు ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ ను మేక‌ర్స్ చాలా సాలిడ్ గా క‌ట్ చేసిన‌ట్టు స‌మాచారం. ఈ వారంలోనే అప్డేట్ వీకెండ్ కి లేదా వచ్చే వారం మొదట్లో ట్రైలర్ ని వదిలేలా ప్లాన్ చేస్తున్నారు అని టాక్ ? ఇక వీర‌మ‌ల్లు ట్రైల‌ర్ వ‌స్తే ఆ సినిమా పై ఉన్న సందేహాలు .. అనుమానాలు .. ఆ లెక్క‌లు పూర్తిగా మారిపోతాయి. మరి చూడాలి వీరమల్లు విధ్వంసం ఎలా ఉంటుంది అనేది.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: