క‌న్న‌ప్ప ... మంచు విష్ణు నిన్ను ఈ విష‌యంలో మెచ్చుకోకుండా ఉండ‌లేం...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న సినిమా కన్నప్ప. అసలు ఈ సినిమాను చూస్తుంటే చాలా విశేషాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా కథను తనికెళ్ల భరణి ర అండ్ ర‌స్టిక్‌ జానర్ లో చాలా తక్కువ బడ్జెట్ లో తీయాలని అనుకున్నారు. కానీ మంచి విష్ణు దగ్గరికి వెళ్లాక దానిని భారీ బ‌డ్జెట్ సినిమాగా తీయాలనుకుని కథను మార్చేశారు. కన్నప్ప సినిమాను చాలామంది విదేశీ టెక్నీషియన్లు పనిచేశారు. అసలు సినిమా జనాలకు బాగా పరిచయమున్న డైరెక్టర్ కూడా లేరు. భారీ బడ్జెట్ పెట్టారు ? ఎప్పుడు సినిమా మొదలుపెట్టి ? ఎప్పుడు పూర్తి చేశారో కూడా తెలియదు. పలుభాషల‌లో కంటెంట్ రెడీ అయింది. సెన్సార్ కూడా పూర్తి చేయించారు. వివిధ భాషలలో పెద్దపెద్ద నటీనటులను ఒప్పించారు. ప్రభాస్ లాంటి నటుడు ఈ సినిమాలో నటించడం అంటే మామూలు విషయం కాదు.. సినిమా చక చకా పూర్తయింది. మంచు విష్ణు తప్ప మరెవరూ లేరు. సినిమా నిర్మాణం బడ్జెట్ ప్రచారం, కంటెంట్, సాలిడ్‌ మార్కెటింగ్ ఇలా ప్రతి ఒక్కటి ఒకే ఒక్కడుగా చేశాడు విష్ణు.


దేశమంతటా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు సింపుల్ గా మార్కెట్ చేసేశారు. జస్ట్ నార్మల్ కమీషన్‌ పద్ధతి మీద విడుదల చేయమని.. బయ్య‌ర్లకు ఇచ్చేశారు. అలా అని ఎవరు పెడితే వారికి ఇవ్వలేదు .. మంచి మంచి బ‌య్య‌ర్ల‌ను ఎంచుకున్నారు. పెద్దపెద్ద నిర్మాతలు చుట్టూ బోలెడు మంది జనాలు ఉండి కూడా సరైన టైమ్ కు ప్రణాళిక ప్రకారం సినిమాలకు విడుదల చేయడం లేదు. అలాంటిది వన్ మెన్ షో తో ఇలాంటి పెద్ద సినిమాను నిర్మించి అనుకున్న టైపు రిలీజ్ చేయడం మామూలు విషయం కాదు. ఈ విషయంలో మాత్రం విష్ణును ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాలి. టాలీవుడ్ జనాలు ఇలాంటి ప్రణాళికను ఆదర్శంగా తీసుకోవాలి. ఇక సినిమా ఎలా ఉండబోతుంది ? అన్నది ఒక్కటే చూడాల్సి ఉంది ఓ భారీ ప్రాజెక్టును ఇన్నాళ్లు ఇలా వంటి చేత్తో ప్రాణంగా తీసుకురావడం అనేది ఒక పెద్ద సక్సెస్ అనుకోవాలి.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: