కోలీవుడ్‌లో ' కూలీ ' సెన్షేషనల్ బిజినెస్... వామ్మో ఈ లెక్కలేంటి సామి...!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ... టాలీవుడ్ కింగ్ నాగార్జున , కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర పలువురు టాలెంటెడ్ నటీ నటులతో కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ్‌రాజ్ తెరకెక్కించిన భారీ సినిమా కూలీ. దేశ వ్యాప్తంగా భారీ హైప్ ఉన్న ఈ సినిమా కోలీవుడ్ నుంచి మొదటి రు . 1000 కోట్ల సినిమా అవుతుంది అన్న రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ అవైటెడ్ సినిమా బిజినెస్ కూడా ఇదే రేంజ్ లో జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు రు. 50 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ మేకర్స్ అడుగుతున్నట్టు ఇప్పటికే టాక్ స్ప్రెడ్ అవుతుంది. అటు కోలీవుడ్ లో కూడా మేకర్స్ రికార్డు ధరలు అడుగుతున్నట్టు తెలుస్తుంది.
కోలీవుడ్లో 110 కోట్ల డీల్ కావాలని మేకర్స్ అడుగుతున్నట్టు కోలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతుంది. ఆగస్టు 15 న కూలీ వరల్డ్ వైడ్ గా పలు పాన్ ఇండియా భాషలలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు రైట్స్ సొంతం చేసుకునేందుకు టాలీవుడ్ నుంచి ఏకంగా పలు పెద్ద సంస్థలు పోటీ లో ఉన్నాయి. అయితే ఒక బడా సంస్థ రు. 50 కోట్ల డీల్ కుదుర్చుకోవడానికి దాదాపు గా ఓకే చెప్పేసిందని అంటున్నారు ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు