నైజాంలో 5వ రోజు కూడా కుమ్మేసిన ' కుబేర‌ ' .. ఎన్ని వ‌సూళ్లు అంటే... !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

కోలీవుడ్ గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా టాలీవుడ్ కింగ్ నాగార్జున - రష్మిక మందన్న కాంబినేషన్లో టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెర‌కెక్కింక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా కుబేర. . భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు ధనుష్ కెరియర్ లోనే మంచి వసూళ్లు అందుకున్న సినిమాగా రికార్డు ల్లో నిలిచింది. అయితే ఈ సినిమా నైజాం మార్కెట్లో సూపర్ స్ట్రాంగ్ కొనసాగిస్తోంది. ఐదు రోజులలో రు. 12 కోట్ల షేర్ కొల్ల‌గొట్టిన ఈ సినిమా ఐదవ రోజు కూడా జీఎస్టీ తో కలిపి ఏకంగా కోటి రూపాయలు షేర్ అందుకున్నట్టు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. దీనిని బట్టి కుబేర రన్ నైజాం మార్కెట్లో ఎంత స్ట్రాంగ్ గా దూసుకు వెళుతుందో అర్థం చేసుకోవచ్చు.  ..


నైజాంలోనే ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్లు .. ఎగ్జిబిట‌ర్లు అయిన ఏసియ‌న్ సినిమాస్ అధినేత ఏసియ‌న్ సునీల్ ఈ సినిమా ను రు. 150 కోట్ల భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. సినిమా దాదాపు గా మూడేళ్ల పాటు నిర్మాణంలో నే ఉంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్బి - అమీగోస్ క్రియేషన్స్ సంస్థల సంయుక్తంగా నిర్మించాయి. .


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి. .

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: