ఈసారి అనుష్క రావడం పక్కా..పోస్టర్ తో హైప్..!

Divya
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క తాజాగా నటిస్తున్న చిత్రం ఘాటి. డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తూ ఉండగా..UV క్రియేషన్ బ్యానర్ పైన తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో తమిళ నటుడు విక్రమ్ ప్రభు కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావలసి ఉండగా కొన్ని కారణాల చేత పోస్ట్ ఫోన్ అవుతూ ఉన్నది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా అభిమానులను చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూసేలా చేస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లేవల్లో జులై 11న థియేటర్లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేశారు.


దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని కూడా అప్పుడే మొదలుపెట్టినట్లుగా కనిపిస్తోంది. చిత్రానికి సంబంధించిన నటీనటుల పోస్టర్లతో పాటు హీరోయిన్ అనుష్క లుక్ కు సంబంధించి పలు రకాల పోస్టర్లను రిలీజ్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు మరో కొత్త పోస్టర్ ను సైతం విడుదల చేసిన చిత్ర బృందం ఫ్యాన్స్ కి ఫుల్ ఎక్కించేలా కనిపిస్తోంది ఈ పోస్టర్. ఈ మేరకు రిలీజ్ చేసిన ఈ కొత్త పోస్టర్లు హీరోయిన్ అనుష్క రెడ్ కలర్ సారీ కట్టుకొని మరి అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా అనుష్క చేతిలో కొడవలితో చాలా గంభీరంగా కనిపిస్తూ ఉండడం గమనార్హం.


ఏదో ఫైట్  సన్నివేశానికి సంబంధించి సన్నివేశంలోని ఫోటో అన్నట్లుగా కనిపిస్తోంది. దీంతో ఈ సినిమా జులై 11వ తేదీన వరల్డ్ వైస్ గా రిలీజ్ అవుతుంది అంటూ పోస్టర్ల తెలియజేశారు. ఈ మధ్యకాలంలో అనుష్క  చాలా తక్కువగానే సినిమాల్లో నటిస్తూ ఉండడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు..అంతేకాకుండా గత కొద్దిరోజులుగా అనుష్క వివాహం చేసుకోబోతోంది అందుకే సినిమాలలో కనిపించడం లేదనే విధంగా వార్తలు వినిపించాయి. మరి ఈ ఏడాదైనా గుడ్ న్యూస్ చెబుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: