దిల్ రాజ్ : పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు?
అయితే ఈ అంశంపై వరుసగా నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి మరి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమాను ఆపేందుకే థియేటర్ల బందు కాల్ తెరపైకి వచ్చిందని ప్రచారం జరిగింది. అయితే దీనిపై తాజాగా దిల్ రాజు కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ సినిమాలు అడ్డుకునే దమ్ము ధైర్యం తమకు లేదన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదే అని క్లారిటీ ఇచ్చారు.
ఇండస్ట్రీలో సమస్యలపై అందరం కూర్చుని కదా మాట్లాడాలి... అని వెల్లడించారు నిర్మాత దిల్ రాజు. మొన్న అల్లు అర్జున్ అలాగే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందని వివరించారు. ఏప్రిల్ 19వ తేదీన తూర్పుగోదావరి డిస్ట్రిబ్యూటర్లు అలాగే ఎగ్జిబిటర్లు సమావేశం అయినట్లు గుర్తు చేశారు. పర్సంటేజ్ విధానం ఉంటే బాగుంటుందని ఈ సమావేశంలో చర్చించారని స్పష్టం చేశారు దిల్ రాజు. కొన్ని సినిమాలు మాత్రమే రెంటు లేదా పర్సంటేజ్ విధానంలో ఆడుతున్నాయన్నారు.
ఇందుకు సంబంధించిన తలెత్తిన సమస్యలపై సరైన పరిష్కారం దొరకడం లేదని... నిర్మాత దిల్ రాజు చెప్పడం జరిగింది. అందరి సినిమాలు ఆడాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుపడుతుందని స్పష్టం చేశారు దిల్ రాజు. ఇకపైన ఇలాంటి గొడవలు రాకుండా చూసుకోవాలని... ఈ బాధ్యత అందరి పైన ఉంటుందని వెల్లడించారు. అయితే నిన్న మెగా కుటుంబానికి సంబంధించిన అల్లు అరవింద్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపేందుకు తామే మీ కుట్ర చేయలేదని క్లారిటీ ఇచ్చారు.