ఆ సౌత్ హీరోతో ఒక్కసారైనా చేయాలనుంది.. కోరిక బయటపెట్టిన అలియా భట్!
కేన్స్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలోనూ పాల్గొన్న అలియా భట్.. ఓ సౌత్ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పడం ప్రాధాన్యత సంతరించింది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్. `పుష్ప`లో విలన్ గా నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఫహాద్ గురించి అలియా భట్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో బ్రూట్ ఇండియాతో జరిగిన సంభాషణలో అలియా మాట్లాడుతూ.. `ఫహాద్ ఫాసిల్ నేను చాలా గౌరవించే వ్యక్తి. అతను ఒక అద్భుతమైన నటుడు. ఆవేశం నాకు అత్యంత ఇష్టమైన చిత్రాలలో ఒకటి. ఒక్కసారైనా హహాద్ ఫాజిల్ తో కలిసి వర్క్ చేయాలనుంది. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను` అంటూ మనసులో కోరిక బయటపెట్టింది.
అలాగే `డార్లింగ్స్ చిత్రంలో రోషన్ మాథ్యూతో కలిసి నటించడం నా అదృష్టం. అతను అప్పటికే మలయాళంలో గుర్తింపు పొందాడు మరియు ఇప్పుడు హిందీలో కూడా సంచలనం సృష్టిస్తున్నాడు` అంటూ అలియా భట్ కొనియాడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.