ఆ 31 ఏళ్ళ కుర్రాడి చేతిలో కృతికి నరకం ?

Veldandi Saikiran
కృతి శెట్టి ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే సక్సెస్ఫుల్ హీరోయిన్ గా అభిమానుల మనసులను దోచుకుంది. ఆ సినిమాలో తనదైన నటన, అందం, అభినయంతో ప్రతి ఒక్క ప్రేక్షకుడి చూపును తనవైపుకు తిప్పుకుంది. మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించడంతో కృతికి సినిమా అవకాశాలు ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ క్యూలో నిలబడ్డారు. వరుసగా సినిమాలలో నటిస్తూ ఈ చిన్నది అగ్ర హీరోయిన్ల జాబితాలో నిలిచిపోయింది. 


కానీ తాను నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. కృతి శెట్టి నటించిన సినిమాలేవి కూడా సక్సెస్ అందుకోలేకపోయాయి. దీంతో ఈ అమ్మడు సినిమా అవకాశాలను పూర్తిగా కోల్పోయింది. దాంతో ఈ అమ్మడు తమిళ సినిమాలలో నటించడానికి తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం కృతి శెట్టి నటిస్తున్న సినిమా L.I.K సినిమా ఒక్కటే. ఈ సినిమాకు కృతి శెట్టి హీరోయిన్ గా నటించారు. తమిళ యూత్ స్టార్ ప్రదీప్ రంగనాథ్ హీరోగా నటిస్తున్నారు. L.I.K సినిమాకు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు.


 లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో ప్రదీప్ నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు L.I.K సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు. ప్రస్తుతం కృతి శెట్టికి L.I.K సినిమా ఒక్కటే తన చేతిలో ఉంది. ఈ సినిమా సక్సెస్ అవుతేనే తనకు సినిమా అవకాశాలు వస్తాయి. లేదంటే కృతి శెట్టి కెరీర్ ఇక్కడితో ముగిసిపోతుందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఏమేరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక కృతి శెట్టి సినిమాలలో అవకాశాల కోసం సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తోంది. హాట్ గా ఫోటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకోగా అవి వైరల్ గా మారుతున్నాయి. ఒకప్పుడు ఎంతో సాంప్రదాయంగా ఉండే ఈ చిన్నది ఇప్పుడు పొట్టి పొట్టి దుస్తులు ధరించి ఎక్స్పోజ్ చేస్తోంది. తన అందాల ఆరబోతకు హద్దు అదుపు ఉండడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: