
గోదావరి రీరిలీజ్ ఎప్పుడంటే..?
ఇక ఈ రీరిలీజ్ మూవీస్ తో మూవీ లవర్స్ కు పండగే పండగ అనే చెప్పాల్సిందే. ఎందుకంటే మంచి మంచి ఫీల్ గుడ్ మూవీస్ రీరిలీజ్ అవ్వనున్నాయి. ఇదిలా ఉండగా.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి మూవీ ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ఒక్క మంచి ఫీల్ గుడ్ మూవీ. ఈ మూవీ రీరిలీజ్ కోసం చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ అయింది కానీ ఇప్పుడు మాత్రం మంచి హిట్ కొడుతుంది. గోదావరి అందాలను తెరపైన చక్కగా చూపిస్తూ ఈయన తీసిన సినిమా గోదావరి. ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో హీరో సుమంత్, హీరోయిన్ కమలిని ముఖర్జీ నటించారు.
ఈ సినిమా చూసినంత సేపు ఒక మంచి అనుభూతి కలుగుతుంది. అయితే ఈ సినిమా మార్చి 1న రీరిలీజ్ అవ్వనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా అనుకున్న తేదీకి రీరిలీజ్ అవ్వలేదు. గోదావరి సినిమా రీరిలీజ్ కి సంబంధించిన తేదీ ఇంకా ప్రకటించలేదు. కానీ సినిమా త్వరలో రీరిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా కోసం వేచి చూసిన అభిమానులందరూ ఎంతో డీలా పడిపోయారు.