సోమవారం కూడా అదిరిపోయే కలెక్షన్లు అందుకున్న నాని కోర్ట్ .. గట్టిగానే రాబట్టాడుగా..!

frame సోమవారం కూడా అదిరిపోయే కలెక్షన్లు అందుకున్న నాని కోర్ట్ .. గట్టిగానే రాబట్టాడుగా..!

Amruth kumar
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .
రీసెంట్ గా మన టాలీవుడ్ బాక్సాఫీస్ ముందుకు వచ్చిన సినిమాల్లో యంగ్ హీరో ప్రియదర్శి అలాగే హర్ష రోషన్ దర్శకుడు రామ్ జగదీశ్ తెర్కక్కించిన మూవీ కోర్టు .. ఇంట్రెస్టింగ్ అంశంతో అంతకుమించి థ్రిల్లింగ్ కథనం తో వచ్చిన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర రూ . 24 కోట్లకు పైగా గ్రాస్ ని రాబట్టింది .. అయితే ఈ సినిమా మూడు రోజుల తర్వాత తొలి వర్కింగ్ డే సోమవారం కీలక టెస్ట్ ను కూడా ఎంతో సునాయాసంగా పాస్ అయింద ని చెప్పాలి .. ఒక సోమవారం నాడే ఈ సినిమా కి ప్రపంచవ్యాప్తంగా నాలుగున్నర కోట్ల కు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తుంది ..

ఇక దీంతో ఈ సినిమా ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనేది అంత అర్థం చేసుకోవచ్చు .. ఇలా మొత్తం నాలుగు రోజుల్లో నే ఈ సినిమా రూ . 29 కోట్ల దగ్గర గ్రాస్ ని రాబట్టి .. అలాగే ఒక యూఎస్ మార్కెట్ లోనే ఈ సినిమా 7 లక్షల పైగా డాలర్స్ గ్రాస్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది .  అలాగే అక్కడ వన్ మిలియన్ దిశ గా దూసుకుపోతుంది .. అయితే ఈ సినిమా కి నాచురల్ స్టార్ నాని నిర్మాత గా వాల్ పోస్టర్ ప్రొడక్షన్ పై ఈ సినిమా ను తెర్కక్కించాడు .. ఇలా నాని నిర్మాత గా వరుసగా భారీ విజయాలు అందుకుంటున్నాడు .. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్ ఓదల దర్శకత్వం లో ఓ సినిమా ను కూడా నాని తీసుకురాబోతున్నాడు . ఇక మరి కోర్టు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకెన్ని కలెక్షన్ల‌ రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: