
అల్లరి నరేష్ తో హిట్ సినిమా తీసిన నిర్మాత మృతి ?
తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అగ్ర నిర్మాత... మృతి చెందారు. అల్లరి నరేష్ హీరోగా మడత కాజా సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన వేద రాజు టింబర్ తాజాగా మరణించారు. ఇవాళ ఉదయం 5 గంటల సమయంలో హైదరాబాదులోని ప్రముఖ ఆసుపత్రిలో వేదరాజు టింబర్.. మరణించినట్లు సమాచారం అందుతుంది. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యం తో బాధపడుతున్న వేద రాజు టింబర్ ... ఒకసారిగా మరణించారట.
గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న వేద రాజు టింబర్... నెల రోజుల కిందట హైదరాబాదులోని ప్రముఖ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారట. అయితే ఆయన... మొన్నటి వరకు కోల్కుంటారని వైద్యులు కూడా చెప్పారట. కానీ నిన్న రాత్రి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో... ఇవాళ ఉదయం మరణించారట. టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ 54 ఏళ్ల వయస్సులో మరణించారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇక టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మరణంతో కుటుంబ సభ్యులందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత వేదరాజుకు భార్య అలాగే కుమార్తె ఉన్నారు. ఇక ఇవాళ సాయంత్రం వరకు నిర్మాత వేదరాజు టింబర్ అంతక్రియలు హైదరాబాదులోనే జరగబోతున్నాయి. అటు అల్లరి నరేష్ కూడా సంతాపం తెలిపారు. వేదరాజు టింబర్ మూర్తి నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పెద్దలు కూడా సంతాపం తెలుపుతున్నారు.