![దేవర 2పై బిగ్ అప్డేట్.. భారీ యాక్షన్ సీన్లతో పాటూ అవి కూడా?](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/movies/movies_latestnews/movie1af6a174-d868-4e42-9523-c3e60cb29d1d-415x250.jpg)
దేవర 2పై బిగ్ అప్డేట్.. భారీ యాక్షన్ సీన్లతో పాటూ అవి కూడా?
దేవర మూవీలో సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో ముఖ్య పాత్రలలో కనిపించారు. గత ఏడాది భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. దేవర పార్ట్ వన్ మిక్స్డ్ టాక్ పొందినప్పటికి.. కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబట్టుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లు వసూళ్లు చేసింది.
అయితే ఈ సినిమాకు పార్ట్ 2 ఉందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో నందమూరి తారక రామారావు నటించిన దేవరకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. అది ఏంటంటే.. దేవర పార్ట్ 2లో భారీ యాక్షన్ సీన్ లు ఉంటాయని సమాచారం. అలాగే చాలా ట్విస్టులు కూడా ఉంటాయని తెలుస్తోంది. సినిమాను ఒక రేంజ్ లో తీసేలా కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక దేవర రెండో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని.. ఆ స్క్రిప్ట్ పనులలో కూడా చాలా మార్పులు చేస్తున్నారని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా.. దేవర పార్ట్ 2 సినిమా షూటింగ్ పనులు ఈ ఏడాది చివరి లో ప్రారంభం అవుతాయని కూడా టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో చూడాలి మరి. ఇక ఈ వార్తలపై దేవర మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.