చిరంజీవి - సురేఖ పెళ్లి వెనక ఉన్న ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు ?
చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు .. ఓ రోజు అల్లు రామలింగయ్య ఇంటిపై వర్షం లో ఉండే సత్యనారాయణ అనే వ్యక్తి కోసం చిరంజీవి అల్లు రామలింగయ్య ఇంటికి వెళ్లారట .. ఆ సమయంలో అల్లు రామలింగయ్య బార్య వచ్చి మీకు ఎవరు కావాలని చిరంజీవిని అడిగారట .. తాను సత్యనారాయణ కోసం వచ్చానని చెప్పగా పైన ఉంటారు అని చెప్పి పంపించారట .. ఆ తర్వాత ఆ వచ్చిన వ్యక్తి చిరంజీవి కదా కుర్రాడు బాగున్నాడు ఇటీవల సినిమాల్లో కనిపిస్తున్నాడు అని అల్లు రామలింగయ్య కు చెప్పిందట .. అంతేకాదు మన కూతురు సురేఖకు ఆ కుర్రోడు మంచి జోడి అని అనిపిస్తుందని కూడా అల్లు రామలింగయ్య కి చెప్పగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అల్లుళ్ళుగా వద్దు అని మొహం మీద అన్నారట ..
ఇక ఆ తర్వాత ఓ 20 రోజులు పాటు చిరంజీవితోనే అల్లు రామలింగయ్య సినిమా షూటింగ్లో పాల్గొన్నారు ..ఆ తర్వాత చిరంజీవి గురించి పూర్తిగా ఎంక్వయిరీ చేయించిన అల్లు రామలింగయ్య చిరంజీవి అలవాట్లు అన్నీ తెలుసుకుని సురేఖకు మంచి జోడి అనుకున్నారట .. ఈ విషయాన్ని అల్లు అరవింద్ ఆలీతో జాలీగా అనే ప్రోగ్రాంలో బయట పెట్టారు .. అలా ఓరకంగా చిరంజీవి సురేఖ పెళ్లికి సత్యనారాయణ అనే వ్యక్తి కారణమయ్యారు .. ఈ సత్యనారాయణ సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తారు అల్లూ ఫ్యామిలీతో దూరపు బంధుత్వం ఉందట.