గేమ్ ఛేంజర్ లోని ఆ సీన్ జగన్ వైయస్సార్ ల మధ్య జరిగిందేనా.?

Pandrala Sravanthi
రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ ఇప్పటికే హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కొంతమందేమో యావరేజ్ ఉంది అని రివ్యూ ఇస్తే మరి కొంతమందేమో బ్లాక్ బస్టర్ అంటున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ కి ఇది ఎక్కువగా నచ్చుతుంది. ఇక ఇతర హీరోల ఫ్యాన్స్ కి యావరేజ్ అనిపిస్తుంది. ఆ విషయం పక్కన పెడితే పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాలోని కొన్ని సన్నివేశాలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మాజీ దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని పోలినట్లు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. మరి ఇంతకీ గేమ్ ఛేంజర్ లో ఉన్న సన్నివేశం జగన్మోహన్ రెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించిందే. మరి వారిని ఉద్దేశించే డైరెక్టర్ శంకర్ ఈ సీన్ సినిమాలో పెట్టారా అనేది ఇప్పుడు చూద్దాం..

 శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేశారు.ఈ సినిమాలో విలన్ పాత్ర లో ఎస్ జె సూర్య నటించారు. సూర్య తండ్రి పాత్రలో నటుడు శ్రీకాంత్ బొబ్బిలి సత్యనారాయణ పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో ఎస్.జే.సూర్య 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడం నా కల అంటూ చెబుతారు. అయితే ఈ డైలాగ్ అచ్చం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే ఉందని కొంతమంది ఈ డైలాగ్ ని వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్లు ఏపీ సీఎం గా ఉండాలి అని ఉంది అంటూ ఎన్నో సందర్భాల్లో చెప్పారు.అయితే ఈ డైలాగ్ జగన్ ను ఉద్దేశించే పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది.

అలాగే ఈ సినిమాలో సూర్యకి తండ్రి పాత్రలో నటించిన శ్రీకాంత్ హాస్పిటల్ బెడ్ పై పడి ఉంటే అక్కడికి వచ్చిన విలన్ సూర్య నేను చనిపోతే నాకు అంత్యక్రియలు జరిగేది చితిమీద కాదు నాన్న.. సీఎం కుర్చీలో పెట్టి చేస్తాం అని జీవో పాస్ చేస్తేనే నేను చనిపోతాను అంటూ ఒక పవర్ ఫుల్ డైలాగ్ చెప్పారు.అయితే ఈ డైలాగ్ కి సంబంధించిన వీడియో ని నెట్టింట వైరల్ చేస్తూ వైయస్ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిలను ఈ వీడియోకి ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డిల మధ్య ఇలాంటి సంభాషణ జరిగిందా ఏంటి అని సోషల్ మీడియా జనాలు కామెంట్లు పెడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: