గేమ్ ఛేంజర్‌కు హైకోర్టులో బ్రేక్ పడుతుందా?
పిటీషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది మహేష్.. తెల్లవారుజాము 4.30గంటలకే సినిమా ప్రదర్శనకు అనుమతివ్వడం నిబంధనలకు విరుద్ధమన్నారు. టికెట్ ధరలకు పెంచుతూ అనుమతి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమన్న న్యాయవాది వాదించారు. ఇలాంటి ఉత్తర్వులివ్వకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరిన న్యాయవాది కోరారు. తరచూ ఇలాంటి మెమోలు ఎందుకిస్తున్నారని ప్రశ్నించిన హైకోర్టు.. తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. మరి ఇవాళ కోర్టులో ఏం చెబుతారో చూడాలి.