చరణ్ సినిమాలో చిరంజీవి రెఫరెన్స్.. ఆ షాట్ కు థియేటర్లలో విజిల్స్ మోతలే!
దర్శకుడు శంకర్ ఈ సినిమాను ఒక బెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ గా మలిచారని అంటున్నారు. ఆయన టేకింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక సినిమాలో కొన్ని సన్నివేశాలు అయితే గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయని, వాటి కోసమే సినిమా చూడొచ్చని చెబుతున్నారు. ఇంకో విశేషం ఏంటంటే.. నాని సూపర్ హిట్ మూవీ "సరిపోదా శనివారం" డైలాగ్‌ను కూడా సినిమాలో వాడారట.
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలో ఒక చిన్న సీన్‌లో కనిపించినా, తన కామెడీ టైమింగ్‌తో థియేటర్‌లో నవ్వులు పూయించారట. "గేమ్ ఛేంజర్" కేవలం రామ్ చరణ్ సినిమా మాత్రమే కాదు, అందరికీ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయని అంటున్నారు.
ఇక అసలు విషయానికొస్తే.. సినిమాలో రామ్ చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి కూడా ఓసారి కనిపించారట. కాకపోతే అది ఒక పోస్టర్‌లో మాత్రమే. అయితే ఫ్యాన్స్‌కు మాత్రం అసలైన ట్రీట్ దక్కింది ఫస్ట్ సాంగ్‌లోనే. "రా మచ్చా మచ్చా" పాటలో మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ "ఇంద్ర" కటౌట్ కనిపిస్తుంది. ఒకే ఫ్రేమ్‌లో రామ్ చరణ్, ఆ పక్కనే చిరంజీవి కటౌట్ కనిపించడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఆ షాట్‌కు థియేటర్లు దద్దరిల్లేలా విజిల్స్ మోతలు వినిపించాయని చెబుతున్నారు.
సినిమా చూసిన ప్రేక్షకులు, విమర్శకులు కూడా పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. "గేమ్ ఛేంజర్" ఒక మంచి పొలిటికల్ డ్రామా అని, రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడని అంటున్నారు. రెండు విభిన్న పాత్రల్లో చరణ్ జీవించాడని చెబుతున్నారు. ఇక విలన్‌గా ఎస్.జె. సూర్య తనదైన శైలిలో అద్భుతమైన నటన కనబరిచాడని, వారి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయని అంటున్నారు.
అయితే సెకండాఫ్‌లో ఎమోషనల్ డెప్త్ కొంచెం తగ్గిందని, కొన్ని అనవసరమైన సీన్లు సినిమా ప్రభావాన్ని తగ్గించాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ చిన్న లోపాలు ఉన్నా, "గేమ్ ఛేంజర్" తప్పకుండా చూడాల్సిన సినిమా అని, ముఖ్యంగా పొలిటికల్ డ్రామాలు ఇష్టపడేవారికి ఈ సినిమా ఒక మంచి ట్రీట్ అని చెప్పొచ్చు. మొత్తానికి మెగాస్టార్ రెఫరెన్స్‌లు, రామ్ చరణ్ నటన, శంకర్ టేకింగ్.. వెరసి "గేమ్ ఛేంజర్" థియేటర్లలో దుమ్ము రేపుతోంది.