అక్కినేని ముగ్గురి హీరోలను .. ఒకేసారి కవర్ చేసిన లక్కీ హీరోయిన్ ఎవరంటే..?

Amruth kumar
అక్కినేని హీరోలు ప్రస్తుతం టాలీవుడ్ లో సరైన విజయం కోసం ఎదురు చూస్తున్నారు .. ఒకవైపు నాగార్జున మరోవైపు ఆయన కొడుకులు నాగచైతన్య‌, అఖిల్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు .. కానీ వారికి సాలిడ్ హిట్‌ మాత్రం రావట్లేదు .. నాగార్జున చివరిగా నటించిన నా సామిరంగ 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెపించలేకపోయింది .. ఆ తర్వాత  బిగ్ బాస్ షో హోస్ట్ గా ఆకట్టుకున్నారు నాగ్ .. ఇప్పుడు వరుసగా సినిమాలను ఓకే చేస్తున్నారు .. ధనుష్ హీరోగా వస్తున్న కుబేర సినిమాలో నాగ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు .. ఇక ఈ సినిమాకు శేఖర్ కమ్ముల  దర్శకత్వం వహిస్తున్నారు . అలాగే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలి సినిమాలోను నాగార్జున కీలకపాత్రలో కనిపించబోతున్నారు.

ఇక నాగా చైతన్య పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న తండేల్ సినిమాతో ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది .. మరో అక్కినేని హీరో అఖిల్ కూడా తర్వాత సినిమా కోసం రెడీ అవుతున్నాడు .. అఖిల్ చివరగా నటించిన ఏజెంట్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది .. ఇక దాంతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలన్న కసితో అఖిల్ ఉన్నాడు .. అయితే ఈ అక్కినేని ముగ్గురు హీరోలతో నటించిన‌ ఏకైక హీరోయిన్ ఒకరు ఉన్నారు.. గ‌తంలో తండ్రీ కొడుకులతో కలిసి నటించిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు కాగా ఈ అక్కినేని హీరోలతో నటించిన‌ ఏకైక హీరోయిన్ మాత్రం ఈ హీరోయిన్‌నే .. ఇంత‌కి ఆమె మరి ఎవరో కాదు స్టార్ బ్యూటీ పూజ హెగ్డే ..

అవును పూజా హెగ్డే నాగచైతన్యతో ఒక లైలా కోసం సినిమా చేసింది .. ఈ సినిమాతోనే టాలీవుడ్ లో అడుగు పెట్టింది. అలాగే అఖిల్ తో  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించింది.. అదే విధంగా నాగార్జునతో సినిమాలో నటించలేదు కానీ పలు యాడ్స్ లో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ .. నాగార్జున , పూజా కలిసి పలు యాడ్స్ చేశారు. ఇలా బుట్ట బొమ్మ పూజాహెగ్డే ఈ అక్కినేని ముగ్గురు హీరోలతో కలిసి నటించింది .. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు వరుస ప్లాప్‌లు  రావడంతో కొంచెం స్పీడు తగ్గించింది .. ప్రజెంట్ పూజా హెగ్డే దళపతి విజయ్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: